స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీకి ప్రాధాన్యత పెరగడం, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్ పెరుగుతున్న నేపథ్యంలో శక్తిమంతమైన, ప్రొఫెషనల్ గ్రేడ్ ఎడిటింగ్ సామర్థ్యం ఉన్న ఫ్రీ ఫొటో ఎడిటింగ్ యాప్‌లకు డిమాండ్ పెరిగింది. సెల్ఫీని పాలిష్ చేయడం నుంచి బ్రాండెడ్ పోస్ట్‌ను రూపొందించడం వరకు ఐవోఎస్, ఆండ్రాయిడ్‌లో రెండింటిలోనూ అందుబాటులో ఉన్న రెండు యాప్‌ల గురించి..
స్నాప్‌స్పీడ్: గూగుల్ డెవలప్ చేసిన స్నాప్‌స్పీడ్ నిపుణులు, ప్రారంభకులు ఇద్దరికీ అనువైన ఎడిటింగ్ సాధనాలు అందిస్తుంది. జెపీఈజీ, రా ఫార్మట్‌లను సపోర్ట్ చేస్తుంది. నాన్–డిస్ట్రక్టివ్ ఎడిటింగ్‌ను అందిస్తుంది. నాణ్యత కోల్పోకుండా ఫొటోలను చక్కగా ట్యూన్ చేసేలా ఉపయోగపడుతుంది.
పిక్స్‌ఆర్ట్: ఫొటో ఎడిటర్ పిక్స్‌ఆర్ట్ కొల్లెజ్ మేకర్, డ్రాయింగ్ టూల్‌లను మిళితం చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ తొలగించడం, రీప్లేస్‌మెంట్ చేయడానికి సంబంధించి దీని ఏఐ–పవర్డ్ టూల్స్ ఉపయోగపడతాయి. ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ (ఉదా: పాపులర్ కార్టూన్ లుక్), కొల్లెజ్ లేఔట్. వివిధ రకాల ఫాంట్‌లతో టెక్ట్స్ ఎడిటింగ్‌కు ఉపయోగపడుతుంది. ఫన్, బోల్డ్, షేరబుల్ ఎడిట్స్‌ను కోరుకునే వారికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది.


