భార్య హత్య.. ప్రాణ స్నేహితురాలే సాక్షి! ఆపై.. సంచలన కేసులో యావజ్జీవ శిక్ష

US Tycoon Robert Durst sentenced to life in murder of best friend - Sakshi

American Tycoon Robert Durst Conviction: ప్రాణ స్నేహితురాలినే దారుణంగా హత్య చేసిన కేసులో అమెరికన్​ వ్యాపారదిగ్గజం రాబర్ట్​ ఎలన్​ డర్​స్ట్​కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 20 ఏళ్ల క్రితం నాటి ఈ హత్య కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. చివరకు ఇప్పుడు  డర్​స్ట్​ పాపం పండి కటకటాల వెనక్కి వెళ్లబోతున్నాడు.
 

స్నేహితురాలు సుసాన్​ బర్మన్​తో సహా ముగ్గురు వ్యక్తులు కనిపించకుండా పోవడం(మిస్సింగ్​.. హత్య చేశాడనే ఆరోపణలు) వెనుక రాబర్ట్​ ప్రమేయం ఉందని లాస్​ ఏంజెల్స్ న్యాయస్థానం​ బలంగా నమ్మింది. పెరోల్​కు కూడా ఆస్కారం లేకుండా తక్షణ శిక్షను అమలు చేసింది.

అమెరికన్​ రియల్​ ఎస్టేట్​ దిగ్గజం రాబర్ట్​ డర్​స్ట్​కి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది. హెబీవో డాక్యుమెంటరీ ‘ది జింక్స్​’ ద్వారా ఆయన జీవితం ప్రపంచానికి పరిచయమే!. ఈ డాక్యుమెంటరీలో ఆయన విలాసవంతమైన జీవితం, హత్యలు, ఆరోపణల ప్రస్తావన ఉంది. 

2000 సంవత్సరంలో ప్రాణ స్నేహితురాలు సుసాన్​ బర్మన్​ హత్యకు కారణమనే ప్రధాన ఆరోపణ ఆయనపై ఉంది.
 

ఈ ఆరోపణలు నిజమని నమ్మిన  లాస్​ ఏంజెల్స్​ జ్యూరీ.. 78 ఏళ్ల డర్​స్ట్​కి గురువారం జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. 

1982లో డర్​స్ట్​ మొదటి భార్య క్యాథీ మోక్​కార్​మాక్​ డర్​స్ట్​ కనిపించకుండా పోయింది. ఆమెను తానే హత్య చేశానని ప్రాణ స్నేహితురాలు సుసాన్​ బర్మాన్​తో డర్​స్ట్​ చెప్పాడు.​

ఆపై ఈ వ్యవహారానికి సంబంధించి అసలు నిజం పోలీసులకు చెబుతుందనే భయంతో సుసాన్​ బర్మాన్​ను బర్​స్ట్​ తుపాకీతో కాల్చి హత్య చేసినట్లు, ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. 

అంతేకాదు 2001 టెక్సాస్ గాల్​వెస్టన్​లో పొరుగింటి వ్యక్తి మోరిస్​ బ్లాక్​​ను హత్య చేసిన ఆరోపణలు రాబర్ట్​ బర్​స్ట్​ మీదా ఉంది. కానీ, ఆత్మరక్షణ కోసమే ఆ హత్య చేసినట్లు ఆ టైంలో రాబర్ట్​ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

మొత్తం మూడు రాష్ట్రాల్లో మూడు హత్యలకు సంబంధించిన కేసులు డర్​స్ట్​పై నమోదు అయ్యాయి.

డర్​స్ట్​కు మరణశిక్ష విధించే ఆస్కారం ఉన్నప్పటికీ.. సాక్ష్యులపై అగాయిత్యాలకు పాల్పడితే అక్కడి చట్టాల ప్రకారం జీవిత ఖైదు విధిస్తారు. ఈ క్రమంలో భార్య మిస్సింగ్​ కేసు, పొరుగింటి వ్యక్తి హత్య కేసు కంటే సుసాన్​ కేసుకు సంబంధించి కేసునే పరిగణనలోకి తీసుకుని డర్​స్ట్​కి యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు.

వృద్ధాప్యం, పైగా అనారోగ్యంతో ఉన్నాకూడా కోర్టు కనికరం చూపించలేదు. రాబర్ట్​ బర్​స్ట్​ను వీలైఛైర్​లోనే ఉంచి.. 38 గంటలపాటు విచారణ చేపట్టింది న్యాయస్థానం. 

చివరగా.. తాను ఏ పాపం చేయలేదని స్వయంగా రాబర్ట్​ బర్​స్ట్​ గంటకు పైగా వాదనలు వినిపించడం విశేషం.

న్యూయార్క్​ నగరానికి చెందిన రాబర్ట్​ ఎలన్​ డర్​స్ట్​.. వారసత్వంగా రియల్​ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అతని మొత్తం ఆస్తి విలువ 8.1 బిలియన్​ డాలర్లకుపైనే. ఇక మూడు హత్యల ఆరోపణలపై ఇప్పుడు జీవిత ఖైదు అనుభవించబోతున్నాడు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top