జోబైడెన్‌ కీలక నిర్ణయం: ఆ 700మందికి చుక్కలే..వారిలో ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌ కూడా!

 Us President Joe Biden To Propose New Billionaires Tax  - Sakshi

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ దేశంలోని బిలియనీర్లకు భారీ షాక్‌ ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని అమలు చేసేలా  ప్రతిపాదనల్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో దాదాపూ 700 మంది అమెరికన్‌ ధనవంతులు పెద్ద ఎత్తున పన్ను కట్టాల్సి ఉండగా..వారిలో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ 35 బిలియన్ డాలర్లు,స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ 50 బిలియన్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.

2023లో జోబైడెన్‌ ప్రభుత్వం 'బిలియనీర్‌ మినిమమ్‌ ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌'ను వసూలు చేయనుంది. వైట్‌ హౌస్‌ నుంచి వెలువడిన అధికారిక ప్రకటన ప్రకారం..100 మిలియన్ కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న 700 మంది బిలియనీర్ల నుంచి ఒక్కొక్కరు కనీసం 20శాతం పన్ను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చే 10ఏళ్లలో కనీసం 1 ట్రిలియన్‌ డాలర్ల బడ్జెట్ లోటును తగ్గించడానికి యూఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని' ది వాషింగ్టన్ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది.     

ఎవరు ఎక్కువ చెల్లించాలి?
అమెరికా ప్రభుత్వం వసూలు చేయనున్న ట్యాక్స్‌ 0.01శాతం కుటుంబాలపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో ఊహించని విధంగా సంపన్నుల నుంచి $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ పన్ను వసూలు కానుంది. ఇక ఈ జోబైడెన్‌ ప్రతిపాదన యూఎస్‌లో తమని తాము మధ్య తరగతిగా కుటుంబాలకు చెందిన వారిగా చెలామణి అవుతూ, పన్ను ఎగ్గొట్టేవారికి ఇబ్బందేనని అమెరికా ఆర్ధిక నిపుణులు అభిపప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్ విభాగం చేసిన అధ్యయనంలో 400 బిలియనీర్ కుటుంబాలు 2010 - 2018 మధ్య వారి ఆదాయంపై సగటున 8.2శాతం మాత్రమే పన్నులు చెల్లించినట్లు వెల్లడించింది.

జెఫ్‌ బెజోస్‌ 35 బిలియన్లు, స్పేస్‌ ఎక్స్‌ అధినేత 50 బిలియన్లు
కొత్త ప్రతిపాదన బిలియనీర్లుకు ఎదురు దెబ్బ తగలనుంది. ఉదాహరణకు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ అదనంగా 50 బిలియన్‌ డాలర్లు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్  35 బిలియన్‌ డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుందని వాషింగ్టన్ పోస్ట్ ఉదహరించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ ఆర్థికవేత్త గాబ్రియేల్ జుక్‌మాన్ అంచనా వేసిన గణాంకాలు చెబుతున్నాయి.  

మరిన్ని అనుమతులు కావాలి
బిలియనీర్లపై అధిక పన్ను విధించాలని రాజకీయ వామపక్షాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే కొత్త ఈ కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తేనే 10ఏళ్లలో 360 బిలియన్ల వరకు జోబైడెన్‌ ప్రభుత్వానికి ఆదాయం చేకూరనుంది.

చదవండి: ట్విట్టర్‌కే ‘శీల’ పరీక్ష పెట్టిన ఎలన్‌మస్క్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top