ఈవీల్లోకి మారండి.. ఇంధన ఖర్చులు తగ్గించుకోండి!

us oil crisis Experts advise for Americans to transform EVs - Sakshi

ఇంధన ఖర్చులు అగ్రరాజ్యాన్ని వణికిస్తున్నాయి. దాన్ని భరించటం అక్కడి వారికీ కష్టంగా ఉంటోంది. విద్యుత్ వాహనాలను (ఎలక్ట్రిక్ వెహికల్స్ ..ఈవీ) ఉపయోగించండి. ఖర్చులు తగ్గించుకోండి అన్న ప్రచారం ఊపందుకుంటోంది. ప్రభుత్వం నుంచి ఇతోధికంగా ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నారు. నిపుణుల అధ్యయనాలు కూడా దీనికి తోడవుతున్నాయి. ఈవీలను ఉపయోగిస్తే, అమెరికాలోని 90శాతం మంది గృహయజమానులు ఇంధన ఖర్చుల నుంచి బయటపడొచ్చని యూనివర్సిటీ ఆఫ్ మిచ్ గాన్ అధ్యయనం చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లోనయితే, వార్షిక ఇంధన ఖర్చులు సగటున 600 డాలర్లకు తగ్గించుకోవచ్చని పేర్కొంది.

తక్కువ ఆదాయం గలవారికి ఇబ్బందే
ఈవీలోకి మారినా తక్కువ ఆదాయంగల ఇళ్లవారికి ట్రాన్స్ పోర్టేషన్ ఖర్చయినా అధికంగానేఉంటుందని అధ్యయనం స్పష్టం చేసింది. తక్కువ ఆదాయం గల వారిలో సగానికిపైగా అంటే 8.3మిలియన్ల హౌస్ హోల్డ్స్ ఈ భారాన్ని మోయవలసి వస్తుందని పేర్కొంది. యూఎస్ వాసులు సగటున 10,961 డాలర్లు ఖర్చు చేస్తున్నారని రవాణాశాఖ అంచనాలుచెబుతున్నాయి. సంపన్నులతో పోలిస్తే తక్కువ ఆదాయం గల వేతన జీవులకు ట్రాన్స్ పోర్టేషన్భారం ఎక్కువగా ఉంది. పన్ను చెల్లించిన తర్వాత లభించే వేతనంలో 10.4 శాతం ధనవంతులు వెచ్చిస్తే, పేదలకు అది 27.4 శాతంగా ఉంది.

ఈవీల్లో పొదుపుకు దోహదం చేసే అంశాలు
బ్యాటరీ పనితీరుపైన ప్రభావం చూపే శీతల వాతావరణం, శిలాజ ఇంధనాలతో పనిచేసే విద్యుత్, గ్రిడ్లు, విద్యుత్ ఛార్జీలు వంటివి ఈవీల ద్వారా ధర తగ్గించుకోవటానికి దోహదం చేస్తాయి. భవిష్యత్తులో గ్రిడ్ డీకార్బనైజేషన్, ఇంధన ధరలు, ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులోకి రావటం వంటి అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

ఈవీలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు
అధ్యయనంలో విద్యుత్ వాహనాల కొనుగోలు అంశాన్ని చేర్చలేదు. ఈవీలు సాధారణమైన గ్యాసొలీన్ తో నడిచే వాహనాల కంటే ఖరీదయినవి. ప్రస్తుతం అమెరికన్ కాంగ్రెస్ 7,500 డాలర్ల ఈవీ టాక్స్ క్రెడిట్ ను, అలాగే ఉపయోగించిన కార్లకు 4వేల డాలర్ల ఈవీ టాక్స్ క్రెడిట్ ను ఇచ్చేందుకు ఆమోదించింది. దానితో పాటు కొన్ని నిబంధనలను కూడా విధించింది. దీనిపై యూఎస్ ఎనర్జీ సెక్రటరీ జెన్నిఫర్ గ్రాన్ హ్లోమ్ మాట్లాడుతూ, బైడన్ ప్రభుత్వం ఇంధన ఖర్చులు తగ్గించటానికి తన వంతు ప్రయత్నం చేస్తోందని చెప్పారు. సాంప్రదాయబద్దంగా గ్యాస్  ట్యాక్ నింపటంతో పోలిస్తే, ఈవీల రీఛార్జి చేసేందుకు సగటున 35 డాలర్లు పొదుపు చేయగలుగుతున్నారని తెలిపారు. 7,500 డాలర్ల టాక్స్ క్రెడిట్ ఇస్తున్నప్పుడు, 26,500 డాలర్ల ఖరీదు చేసే జనరల్ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయటం పెద్ద కష్టమేమీ కాదని ఆమె చెబుతున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top