ట్విటర్‌ యూజర్లకు భారీ షాక్‌.. ఇక డబ్బులు చెల్లించాల్సిందే..

Twitter set to remove legacy blue ticks from April 1 - Sakshi

యూజర్లకు ట్విటర్‌ భారీ షాకిచ్చింది. ఏప్రిల్‌ 1 నుంచి బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1 తర్వాత బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ కావాలంటే నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.  

ట్విటర్‌ బాస్‌గా కొత్త అవతారం ఎత్తిన వెంటనే ఎలాన్‌ మస్క్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. అంటే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న యూజర్లకు  మాత్రమే బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ అందిస్తారు. మిగిలిన యూజర్లకు తొలగించనుంది. 

బ్లూ టిక్‌ వెరిఫికేషన్ కోసం ఎంత చెల్లించాలంటే  
ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సేవల్ని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. గతంలో బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ను మీడియా సంస్థలు, ప్రజా ప్రతినిధులు, ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంతో పాటు ఆయా రంగాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించే వారికి మాత్రమే ఉచితంగా ఇచ్చింది. ఈ ఫీచర్‌ వల్ల అకౌంట్లకు భద్రతతో పాటు కొన్ని అదనపు ఫీచర్లు వినియోగించుకునే సౌకర్యం ఉండేంది.

అయితే బాస్‌గా మస్క్‌ ట్విటర్‌ ఫ్రీ బ్లూటిక్‌ సేవల్ని తొలగించారు. పెయిడ్‌ సర్వీసుల్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ట్విటర్‌ బ్లూ బ్లూ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ వినియోగదారులకు నెలకు రూ. 900 చెల్లించాల్సి ఉంది. ట్విటర్‌ వెబ్‌ వినియోగదారులు రూ.600 సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉండగా.. సంవత్సర చందాదారులకు ప్రత్యేక డిస్కౌంట్‌లు ఇస్తున్నట్లు ట్విటర్‌ పేర్కొంది. 

ట్విటర్‌ బ్లూకి మరిన్ని మార్పులు 
ట్విటర్ తన  బ్లూ సబ్‌స్క్రిప్షన్‌లో కొన్ని మార్పులు చేసింది. తాజా నివేదికల ప్రకారం, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. గతంలో కొత్త ట్విటర్‌ అకౌంట్‌కు బ్లూ టిక్‌ పొందాలంటే 90 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఆ సమయాన్ని 30 రోజులకు తగ్గించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top