
టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచీ ఆర్‌టీఆర్ 310 సీసీలో 2025 వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. సరికొత్త అప్‌డేట్‌లతో వచ్చిన ఈ బైక్ బేసిక్ మోడల్ ధర రూ.2.39 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.2.57 లక్షలుగా ఉంది. ఓబీడీ2బీ నిబంధనలకు లోబడి పనిచేసే 312.12 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఇందులో ఉంది.
ఇది 9700 ఆర్‌పీఎమ్ వద్ద 35.6 పీఎస్ శక్తిని, 6,650 ఆర్‌పీఎమ్ వద్ద 28.7 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్తగా సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, ట్రాన్స్‌పేరెంట్ క్లచ్ కవర్, క్రూయిజ్ కంట్రోల్, అయిదు అంగుళాల టీఎఫ్‌టీ జెన్–2 కనెక్టెడ్ క్లస్టర్, బ్లూటూత్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ తదితర ఫీచర్లున్నాయి.
ఇదీ చదవండి: ఫేస్‌బుక్‌పై రూ.68 వేలకోట్ల దావా
‘టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310 అరంగేట్రం నాటి నుంచే నేకెడ్ స్పోర్ట్స్ విభాగంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. 2025 ఎడిషన్‌లో అత్యాధునిక సాంకేతిక, డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లు, స్టయిలిష్‌తో పాటు రైడర్ భద్రతను మరింత మెరుగుపరిచాము’ అని టీవీఎస్ మోటార్ బిజినెస్ హెడ్(ప్రీమియం విభాగం) విమల్ సుంబ్లే అన్నారు.