
జులై 7–9 మధ్య పబ్లిక్ ఇష్యూ
రూ. 2,000 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల(క్యూఎస్‌ఆర్)తోపాటు విమానాశ్రయాల్లో లాంజ్ బిజినెస్ నిర్వహించే ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 1,045–1,100 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 7న ప్రారంభమై 9న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 4న షేర్లను కేటాయించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్ కపూర్ ఫ్యామిలీ ట్రస్ట్ రూ. 2,000 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది.
తద్వారా ఐపీవో నిధులు మొత్తం ప్రమోటర్లకు అందనున్నాయి. ప్రమోటర్ సంస్థ కే హాస్పిటాలిటీ బ్రాండుతో ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్‌సహా విదేశాలలోనూ పలు ఆతిథ్య సేవలు, ఫుడ్ సర్వీసుల బిజినెస్‌లను నిర్వహిస్తోంది. ఈ ముంబై కంపెనీ తొలుత 2009లో తొలి ట్రావెల్ క్యూఎస్‌ఆర్‌ను ప్రవేశపెట్టింది. కపూర్ ఫ్యామిలీ ట్రస్ట్‌తోపాటు ఎస్‌ఎస్‌పీ గ్రూప్ పీఎల్‌సీ కంపెనీని ప్రమోట్ చేశాయి.
కంపెనీ ప్రధానంగా ఎంపిక చేసిన ఆహారం, పానీయాల(ఎఫ్‌అండ్‌బీ)ను ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా విమానాశ్రయాలు, కొన్ని జాతీయ రహదారి ప్రాంతాలలో సమకూర్చుతోంది. దేశీయంగా 14 విమానాశ్రయాలలో సర్వీసులు అందిస్తోంది. మలేసియాలో 3 ఎయిర్‌పోర్టులలో లాంజ్ సేవలు కలి్పస్తోంది. 2024 జూన్‌కల్లా దేశ, విదేశాలలో 117 పార్ట్‌నర్, సొంత బ్రాండ్లతో కలిపి 397 ట్రావెల్ క్యూఎస్‌ఆర్ ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది. వీటిలో సుప్రసిద్ధ కేఎఫ్‌సీ, పిజ్జా హట్, కాఫీ బీన్, టీ లీఫ్, సబ్‌వే, బికనీర్‌వాలా, అడయార్ ఆనంద్ భవన్, వౌ మోమో తదితర బ్రాండ్స్ ఉన్నాయి.