హైదరాబాద్‌ వర్సెస్‌ భాగ్యనగర్‌.. సారీ చెప్పిన ప్రముఖ ట్రావెల్‌ ఏజెన్సీ | Travel App Ixigo Showing Hyderabad While typing Bhagyanagar It Lead an issue on internet | Sakshi
Sakshi News home page

భాగ్యనగర్‌ అని టైప్‌ చేస్తే హైదరాబాద్‌ చూపెడుతోంది! ఇద్ది పద్దతి కాదు?

Jan 17 2022 11:09 AM | Updated on Jan 17 2022 11:51 AM

Travel App Ixigo Showing Hyderabad While typing Bhagyanagar It Lead an issue on internet - Sakshi

హైదరాబాద్‌ నగరం పేరును భాగ్యనగర్‌ మార్చాలంటూ వస్తున్న డిమాండ్లు ఇప్పటికే వివాస్పదం కాగా ఇందులో వేలు పెట్టిన ఓ ట్రావెల్‌ ఏజెన్సీ సంస్థ చిక్కుల్లో పడింది. ఇష్టారీతిగ నగర పేర్లు మార్చేందుకు మీరెవరు అంటూ నెటిజన్లు దండెత్తడంతో సారీ చెప్పింది.

స్టార్టప్‌గా మొదలై యూనికార్న్‌ దిశగా పరుగులు పెడుతోంది ట్రావెల్‌ యాప్‌ ఇక్సిగో. బస్సులు, రైళ్లు, విమాన టిక్కెట్లు ఈ యాప్‌లో బుక్‌ చేసుకోవచ్చు. నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ యాప్‌ అనేక మంది యూజర్ల అభిమానాన్ని సంపాదించుకుంది. తాజాగా హైదరాబాద్‌కి చెందిన ఓ నెటిజన్‌ ఇక్సిగో వెబ్‌సైట్‌లో భాగ్యనగర్‌ అని టైప్‌ చేయగా రాజీవ్‌గాంధీ ఇంటర్నెషన్‌ ఎయిర్‌పోర్ట్‌, హైదరాబాద్‌ అంటూ స్క్రీన్‌పై ప్రత్యక్షం అయ్యింది.

హైదరాబాద్‌ నగరం పేరును భాగ్యనగర్‌ మార్చాలంటూ వస్తున్న డిమాండ్లు ఇప్పటికే వివాస్పదం కాగా ఇందులో వేలు పెట్టిన ఓ ట్రావెల్‌ ఏజెన్సీ సంస్థ చిక్కుల్లో పడింది. ఇష్టారీతిగ నగర పేర్లు మార్చేందుకు మీరెవరు అంటూ నెటిజన్లు దండెత్తడంతో సారీ చెప్పింది.

భాగ్యనగర్‌ అని టైప్‌ చేస్తే హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టును చూపించడంపై నెటిజన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సదరు స్క్రీన్‌షాట్‌ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. రేపు ఎవరో వచ్చి ఇంకేదో పేరు పెట్టాలంటూ డిమాండ్‌ చేస్తే ఇలాగే చేస్తారా అంటూ ప్రశ్నించారు. క్షణాల్లో ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇక్సిగో చేసిన పనిపై నెటిజన్లు  మండిపడ్డారు. బాయ్‌కాట్‌ ఇక్సిగో అంటూ ట్రెండ్‌ చేశారు.

నెటిజన్ల ఆగ్రహంతో ఇక్సిగో వివరణ ఇచ్చింది. భాగ్యనగర్‌ అని టైప్‌ చేస్తే హైదరాబాద్‌ అని చూపించడం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, టెక్నికల్‌ ఎర్రర్స్‌ వల్ల అలా జరిగిందని తెలిపింది. జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement