అమెరికాలో అపర కుబేరులు మనవాళ్లే.. | Top 10 richest Indians in the US 2025 Jay Chaudhry, Vinod Khosla Sundar Pichai | Sakshi
Sakshi News home page

అమెరికాలో అపర కుబేరులు మనవాళ్లే..

Jul 11 2025 2:25 PM | Updated on Jul 11 2025 3:46 PM

Top 10 richest Indians in the US 2025 Jay Chaudhry, Vinod Khosla Sundar Pichai

విదేశాల్లో పుట్టి అమెరికాలో అపర కుబేరులుగా ఎదిగినవాళ్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్2025 ర్యాంకింగ్స్లో 12 మంది భారత సంతతి బిలియనీర్లు చోటు దక్కించుకోవడంతో అత్యధిక మంది విదేశీ అమెరికన్కుబేరులకు జన్మస్థానంగా భారత్ నిలిచింది. 2022లో కేవలం ఏడుగురు భారత సంతతి బిలియనీర్లు ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగారు.

అమెరికాలో విదేశీ సంతతి సంపన్నుల తాజా జాబితాలో భారత్‌.. ఇజ్రాయెల్, తైవాన్లను అధిగమించింది. ఈ రెండు దేశాలకు చెందినవారు చెరో 11 మంది జాబితాలో ఉన్నారు. స్వయం కృషితో ఎదిగిన భారత సంతతి కుబేరులు.. విదేశాలలో జన్మించిన యూఎస్ బిలియనీర్ల మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల సంపదలో గణనీయ వాటాను అందిస్తున్నారు.

ఆల్ఫాబెట్ అధినేత సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి కొత్తవారు ఇటీవల ఈ జాబితాలో చేరినప్పటికీ అంతగా గుర్తింపు లేని దిగ్గజాలతో పోలిస్తే వారు ఆశ్చర్యకరంగా తక్కువ ర్యాంకులో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ దిగ్గజం జెడ్ స్కేలర్ వ్యవస్థాపకుడు జే చౌదరి 17.9 బిలియన్ డాలర్ల సంపదతో భారత సంతతి అమెరికన్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. విద్యుత్తు, నీరు లేని మారుమూల హిమాలయ గ్రామం పనోహ్ లో జన్మించిన చౌదరి గ్రాడ్యుయేట్ చదువుల కోసం 1980లో తొలిసారి అమెరికా వెళ్లారు.

భారత సంతతి అపర కుబేరులు వీళ్లే..

జే చౌదరి (17.9 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (జెడ్ స్కేలర్)

వినోద్ ఖోస్లా (9.2 బిలియన్ డాలర్లు) - సన్ మైక్రో సిస్టమ్స్, వెంచర్ క్యాపిటల్

రాకేష్ గంగ్వాల్ (6.6 బిలియన్ డాలర్లు) - ఎయిర్లైన్స్ (ఇండిగో సహ వ్యవస్థాపకుడు)

రోమేష్ టి.వాధ్వానీ (5.0 బిలియన్ డాలర్లు) - సాఫ్ట్వేర్ - సింఫనీ టెక్నాలజీ గ్రూప్

రాజీవ్ జైన్ (4.8 బిలియన్ డాలర్లు) - ఫైనాన్స్ (జీక్యూజీ పార్టనర్స్ చైర్మన్)

కవితార్క్ రామ్ శ్రీరామ్ (3.0 బిలియన్ డాలర్లు) - గూగుల్, వెంచర్ క్యాపిటల్

రాజ్ సర్దానా (2.0 బిలియన్ డాలర్లు) - టెక్నాలజీ సేవలు (ఐటీ సంస్థ టీసీజీఐ)

డేవిడ్ పాల్ (1.5 బిలియన్ డాలర్లు) - వైద్య పరికరాలు (వెల్క్వెస్ట్ / న్యూరోసిగ్మా)

నికేష్ అరోరా (1.4 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ)

ఫోర్బ్స్ తాజా డేటా ఆధారంగా అమెరికాలోని అత్యంత ధనవంతులైన భారత సంతతి బిలియనీర్లు వీరే. టెక్ దిగ్గజాలు సుందర్ పిచాయ్ (1.1 బిలియన్ డాలర్లు), సత్య నాదెళ్ల (1.1 బిలియన్ డాలర్లు) 10, 11వ స్థానాల్లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement