breaking news
Jay Chaudhry
-
అమెరికాలో అపర కుబేరులు మనవాళ్లే..
విదేశాల్లో పుట్టి అమెరికాలో అపర కుబేరులుగా ఎదిగినవాళ్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ 2025 ర్యాంకింగ్స్‌లో 12 మంది భారత సంతతి బిలియనీర్లు చోటు దక్కించుకోవడంతో అత్యధిక మంది విదేశీ అమెరికన్ కుబేరులకు జన్మస్థానంగా భారత్ నిలిచింది. 2022లో కేవలం ఏడుగురు భారత సంతతి బిలియనీర్లు ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగారు.అమెరికాలో విదేశీ సంతతి సంపన్నుల తాజా జాబితాలో భారత్.. ఇజ్రాయెల్, తైవాన్లను అధిగమించింది. ఈ రెండు దేశాలకు చెందినవారు చెరో 11 మంది ఈ జాబితాలో ఉన్నారు. స్వయం కృషితో ఎదిగిన ఈ భారత సంతతి కుబేరులు.. విదేశాలలో జన్మించిన యూఎస్ బిలియనీర్ల మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల సంపదలో గణనీయ వాటాను అందిస్తున్నారు.ఆల్ఫాబెట్ అధినేత సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి కొత్తవారు ఇటీవల ఈ జాబితాలో చేరినప్పటికీ అంతగా గుర్తింపు లేని దిగ్గజాలతో పోలిస్తే వారు ఆశ్చర్యకరంగా తక్కువ ర్యాంకులో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ దిగ్గజం జెడ్ స్కేలర్ వ్యవస్థాపకుడు జే చౌదరి 17.9 బిలియన్ డాలర్ల సంపదతో భారత సంతతి అమెరికన్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. విద్యుత్తు, నీరు లేని మారుమూల హిమాలయ గ్రామం పనోహ్ లో జన్మించిన చౌదరి గ్రాడ్యుయేట్ చదువుల కోసం 1980లో తొలిసారి అమెరికా వెళ్లారు.భారత సంతతి అపర కుబేరులు వీళ్లే..జే చౌదరి (17.9 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (జెడ్ స్కేలర్)వినోద్ ఖోస్లా (9.2 బిలియన్ డాలర్లు) - సన్ మైక్రో సిస్టమ్స్, వెంచర్ క్యాపిటల్రాకేష్ గంగ్వాల్ (6.6 బిలియన్ డాలర్లు) - ఎయిర్‌లైన్స్ (ఇండిగో సహ వ్యవస్థాపకుడు)రోమేష్ టి.వాధ్వానీ (5.0 బిలియన్ డాలర్లు) - సాఫ్ట్వేర్ - సింఫనీ టెక్నాలజీ గ్రూప్రాజీవ్ జైన్ (4.8 బిలియన్ డాలర్లు) - ఫైనాన్స్ (జీక్యూజీ పార్టనర్స్ చైర్మన్)కవితార్క్ రామ్ శ్రీరామ్ (3.0 బిలియన్ డాలర్లు) - గూగుల్, వెంచర్ క్యాపిటల్రాజ్ సర్దానా (2.0 బిలియన్ డాలర్లు) - టెక్నాలజీ సేవలు (ఐటీ సంస్థ టీసీజీఐ)డేవిడ్ పాల్ (1.5 బిలియన్ డాలర్లు) - వైద్య పరికరాలు (వెల్క్వెస్ట్ / న్యూరోసిగ్మా)నికేష్ అరోరా (1.4 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ)ఫోర్బ్స్ తాజా డేటా ఆధారంగా అమెరికాలోని అత్యంత ధనవంతులైన భారత సంతతి బిలియనీర్లు వీరే. టెక్ దిగ్గజాలు సుందర్ పిచాయ్ (1.1 బిలియన్ డాలర్లు), సత్య నాదెళ్ల (1.1 బిలియన్ డాలర్లు) 10, 11వ స్థానాల్లో నిలిచారు. -
అత్యంత ధనవంతుల జాబితాలోని టాప్ 10 ఎన్ఆర్ఐలు (ఫొటోలు)
-
చిన్న గ్రామం.. చెట్ల కింద చదువు: ఇప్పుడు అమెరికాలో..
అమెరికాలో ఉన్న అత్యంత సంపన్నులైన భారతీయులలో ఒకరు 'జై చౌదరి' (Jay Chaudhry). ఒక చిన్న గ్రామంలో పుట్టి చెట్ల కింద చదువుకొని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటూ ఈ రోజు ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. ఇంతకీ జై చౌదరి ఎవరు, అతని విజయ రహస్యం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో.. సైబర్ సెక్యూరిటీ సంస్థ Zscaler సీఈఓ & ఫౌండర్ 'జై చౌదరి' హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆ గ్రామానికి సరైన విద్యుత్ సరఫరా లేకపోవడమే కాకుండా.. తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు కాబట్టి సరైన సౌకర్యాలు కూడా లేకపోవడంతో చిన్నతనంలో చెట్ల కింద చదువుకునేవాడు. ప్రతిరోజు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరుగు గ్రామమైన ధుసరాలోని హైస్కూల్‌కు నడిచి వెళ్ళేవాడనని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి, ది యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటిలో ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ మాస్టర్స్ ప్రోగ్రామ్ చదవడానికి అమెరికాకు పయనమయ్యారు. చదువు పూర్తయిన తరువాత సుమారు ఇరవై సంవత్సరాలు ఐబిఎమ్, యూనిసిస్ (Unisys), ఐక్యూ వంటి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేశారు. 1996లో జై చౌదరి సైబర్ సెక్యూరిటీ సంస్థను ప్రారంభించాడు. అంతకంటే ముందు ఇతడు కోర్‌హార్బర్, సెక్యూర్ ఐటీ, సైఫర్‌ట్రస్ట్, ఎయిర్‌డిఫెన్స్ వంటి కంపెనీలను కూడా ప్రారంభించారు. (ఇదీ చదవండి: భారత్‌లో 2023 సుజుకి హయబుసా లాంచ్: ధర వింటే దడ పుట్టాల్సిందే..) 2008లో Zscaler స్థాపించారు. ఇది ప్రస్తుతం 2,600 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ కంపెనీ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అమెరికాలోని అత్యంత సంపన్నులైన భారతీయుల జాబితాలో ఒకరుగా నిలిచారు. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం 15 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు సుమారు లక్ష కోట్ల కంటే ఎక్కువ. -
కరెంట్ లేని ఇంటి నుంచి కోట్లకు అధిపతి దాకా..
‘‘ఈజీ మనీని క్వాలిటీ లెస్ సర్వీసులతో.. ఎంత త్వరగా సంపాదిస్తారో.. అంతే త్వరగా పొగొట్టుకుంటారు కూడా. అందుకే డబ్బు తక్కువొచ్చినా సరే క్వాలిటీగా అందించడం తన ఉద్దేశమ’’ని తరచూ చెప్తుంటారు జే చౌద్రి. అమెరికాలో టాప్ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయిన జీస్కేలర్ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా ఉన్న జే చౌద్రి.. తాజా ఐఐఎఫ్ఎల్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ఈ స్థాయికి చేరడానికి పడ్డ కష్టాల్ని మనసారా గుర్తు చేసుకుంటారాయన. జీస్కేలర్ అధినేత.. జే చౌద్రి. పుట్టిపెరిగింది హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ కుగ్రామంలో. అమెరికాలో జీస్కేలర్ కంపెనీ ద్వారా బిలియనీర్‌గా ఎదిగారాయన. 62 ఏళ్ల ఈ పెద్దాయన సంపద విలువ ఇప్పుడు ఒక లక్షా 21 వేల 600 కోట్ల రూపాయలు. గత ఏడాదిగా ఒక్కోరోజుకి సంపాదిస్తోంది అక్షరాల 153 కోట్ల రూపాయలు. అందుకే ఐఐఎఫ్ఎల్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో నిలిచారు. అయితే ఆయన పుట్టుక నుంచి ఎదిగే క్రమం మొత్తం దాదాపుగా పేదరికంలోనే నడిచింది. నడకే నేర్పింది హిమాచల్‌ప్రదేశ్ ఉనా జిల్లా పనోహ్‌లో చౌద్రీ పుట్టిపెరిగారు జే చౌద్రీ(1958లో). ఆనాటి పరిస్థితులకు తగ్గట్లే ఆయన బాల్యం గడిచింది. స్కూల్ టైంలో తోటి పిల్లలంతా సైకిళ్ల మీద వెళ్తుంటే.. పేద రైతు కుటుంబంలో పుట్టిన చౌద్రీ మాత్రం నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ బడికి వెళ్లేవారు. ఇక చౌద్రీ బీటెక్ చదివేదాకా ఆయన ఇంటికి మంచి నీరు, కరెంట్ సౌకర్యాలు కూడా లేవట. చెట్ల కింద చదువులతో స్కూల్ విద్య పూర్తి చేసిన చౌద్రీని.. మంచి చదువులు చదివించాలని ఆయన తల్లి ఆశపడింది. అందుకే పుస్తెలమ్మి కొడుకును చదివించింది. ఆ తల్లి ఆశలు ఫలించి ఫ్లస్‌టూ స్థాయి చదువుల్లో గోల్డ్ మెడల్ సాధించాడు ఆ కుర్రాడు. అందరిలా డిగ్రీ కాకుండా.. ఇంజినీరింగ్ చదవమని ఓ లెక్చరర్ ప్రొత్సహించాడు. దీంతో వారణాసి ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారాయన. పనోహ్ నుంచి ఈ ఘనత దక్కించుకున్న తొలి విద్యార్థి కూడా చౌద్రీనే. ఆపై స్కాలర్షిప్ ద్వారా పైచదువులకు అమెరికా వెళ్లారు. భార్య సపోర్ట్‌తో.. ఎంబీఏ, ఎమ్మెస్ తర్వాత తొలుత కొన్ని కంపెనీల్లో పని చేసిన చౌద్రీ.. ఆ తర్వాత రాజీనామా చేసి భార్య జ్యోతి సహకారంతో వరుసగా కంపెనీలు పెట్టడం, వాటిని లాభాలకు పెద్దకంపెనీలకు అమ్మేస్తూ వచ్చారు. 1997లో సెక్యూర్ఐటీ, చిపర్ట్రస్ట్ కంపెనీలను నెలకొల్పారు. వాటిని సెక్యూర్ కంప్యూటింగ కార్పొరేషన్‌కు అమ్మేసి, ఆపై ఎయిర్‌డిఫెన్స్‌ను స్థాపించారు. కొన్నాళ్లకు ఈ కంపెనీని కూడా మోటరోలాకు అమ్మేశారు. ఆపై కోర్‌హార్బర్(ఏటీ అండ్ టీ కొనుగోలు చేసింది), సెక్యూర్ఐటీ(వరిసైన్ కొనేసింది) కంపెనీలను నెలకొల్పారు. చివరికి జయ్‌చౌదరి 2007లో కాలిఫోర్నియా శాన్జోన్స్ బేస్‌గా ‘జీస్కేలర్’ క్లౌడ్‌బేస్డ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కంపెనీని స్థాపించారు. 2018లో ఐపీవో ద్వారా 192 మిలియన్ డాలర్లను పోగేశారు. ఏడాది తిరగకుండానే రెట్టింపు ఆదాయం, ఆ మరుసటి ఏడాదికి జే చౌద్రీని ఫోర్బ్స్ బిలియనీర్‌గా నిలబెట్టింది జీస్కేలర్. 185 దేశాలు, 150కిపైగా డేటా సెంటర్లు.. పదివేలకు తగ్గని ఉద్యోగులకు బాస్‌గా ఉన్నారు జే చౌద్రీ. కార్బొరేట్ కంపెనీలపై జరిగిన సైబర్ దాడులు, జీస్కేలర్ క్లౌడ్ సర్వీసు వినియోగం పెరగడానికి కారణంకాగా.. ఈ ప్రభావంతో చౌద్రీ సంపద ఏకంగా 85 శాతం పెరిగింది. పేరెంట్స్ రుణం వెలకట్టలేనిది.. జీస్కేలర్లో 45 శాతం వాటా జే చౌద్రికి ఉంది. ఇప్పడాయన ఇండియన్-అమెరికన్ ఎంట్రప్రెన్యూర్. బిలియనీర్. అయినప్పటికీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం చిన్నపిల్లాడైపోతాడు. విమానం ఎక్కాలన్న తల్లి కోరికను, తండ్రి చిన్నచిన్న సరదాలను తీర్చిన చౌద్రీ.. పక్కా ఫ్యామిలీమ్యాన్. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, భారత రాజకీయాలపై అధ్యయనం చేస్తుంటారు. కఠోర శ్రమ, ధైర్యంగా ముందడుగు వేయడం, అదృష్టం.. ఈ మూడు తన సక్సస్కి కారణాలని చెప్పే చౌద్రి.. చేసే పని ఏదైనా సరే నిజాయితీ, కచ్చితత్వం ఉండాలంటూ యువతకు పిలుపు ఇస్తుంటారు. - సాక్షి, వెబ్‌స్పెషల్