
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి తెప్పరిల్లినప్పటికీ వారాంతంలో నష్టాలలోనే ముగిసాయి. మిశ్రమ గ్లోబల్ సూచనల మధ్య, సూచీలు ఆగస్టు సిరీస్‌ను ప్రతికూల నోట్‌తో ప్రారంభించాయి. ఐటీ బ్యాంకింగ్ , ఆయిల్ & గ్యాస్ పేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. పవర్ , రియాల్టీ పేర్లలో చివరి గంట కొనుగోళ్లతో మార్కెట్ నష్టాలు చాలా వరకు పరిమితమైనాయి.
చివరికి (జూలై 28) వరుసగా రెండో సెషన్లో నష్టాలతోనే ముగిసాయి సెన్సెక్స్ 106.62 పాయింట్లు లేదా 0.16 శాతం క్షీణించి 66,160 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లు లేదా 0.07 శాతం క్షీణించి 19,64 ముగిసాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బిపిసిఎల్, టాటా మోటార్స్ మరియు హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్‌గా ఉండగా, ఎన్‌టిపిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ , ఎం అండ్ ఎం టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)