భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..పతనమైన బ్యాంకు షేర్లు | Sakshi
Sakshi News home page

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..పతనమైన బ్యాంకు షేర్లు

Published Mon, Oct 3 2022 10:21 AM

Today Stock Market Update In Telugu - Sakshi

జాతీయ, అంతర్జాతీయ అంశాలు దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో అక్టోబరు నెలకు స్టాక్‌ మార్కెట్‌లు నష్టాలతో స్వాగతం పలికాయి. యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచడం, అదే సమయంలో చమురు ఉత్పత్తిదారులు ఉత్పత్తిని తగ్గించవచ్చనే అంచనాలతో చమురు ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

సోమవారం ఉదయం 10.20గంటల సమయానికి సెన్సెక్స్‌ 505 పాయింట్లు నష్టపోయి 56921 వద్ద నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 16962 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.  

ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, దివీస్‌ ల్యాబ్స్‌, ఎన్‌టీపీసీ,సిప్లా, సన్‌ఫార్మా, కోల్‌ ఇండియా, అపోలో హాస్పిటల్‌, బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, హీరోమోటో కార్పొ,యూపీఎల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హిందాల్కో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా, మారుతి సుజికీ, ఎథేర్‌ మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే, టాకా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీఎసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement