సాక్షి మనీ మం‍త్రా : భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌ | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మం‍త్రా : భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌

Published Thu, Sep 21 2023 9:23 AM

Today Stock Market Opening updates sensex down 300 points - Sakshi

Today Stock Market Opening: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో   ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లు  కుప్పకూలగా నిఫ్టీ 19900 స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ , హెచ్‌సీఎల్‌టెక్‌, రిలయన్స్‌, గ్రాసిం ప్రధానంగా నష్టపోతున్నాయి.  ప్రస్తుతం  276 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌  66515 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు నష్టంతో 198258 వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు డా. రెడ్డీస్‌, అదానీ పోర్ట్స్‌, దివీస్‌ ల్యాబ్స్‌, జియో ఫైనాన్షియల్‌, హిందాల్కో లాభపడుతున్నాయి.

రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి  స్వల్పంగా తగ్గి 83.09 వద్ద ప్రారంభమైంది. డాలర్ ఇండెక్స్ ఆరు నెలల గరిష్ట స్థాయి 105.68కి  చేరింది.   రెండు దశాబ్దాల గరిష్టానికి చేరిన ప్రధాన వడ్డీ రేటును విస్తృతంగా ఊహించినట్లుగానే యధాతథంగా ఉంచింది ఫెడ్‌. అయితే ఈ ఏడాది మరోసారి రేటు పెంపు  ఉండ వచ్చని నిపుణుల అంచనా.  

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement

తప్పక చదవండి

Advertisement