పెరిగిన బంగారం, వెండి ధర.. ఎంతంటే..? | Gold And Silver Prices Today On 12-06-2024: | Sakshi
Sakshi News home page

Gold Rate Today: పెరిగిన బంగారం, వెండి ధర.. ఎంతంటే..?

Jun 12 2024 1:46 PM | Updated on Jun 12 2024 2:47 PM

today gold rates on commodity market in main cities in the country

ఈక్విటీమార్కెట్‌లు ఇటీవల కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,150 (22 క్యారెట్స్), రూ.72,160 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.300, రూ.320 పెరిగింది.

చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.66,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.72,870 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,300.. 24 క్యారెట్ల ధర రూ.72,310కు చేరాయి. మార్కెట్‌లో కేజీ వెండి ధర ఏకంగా రూ.800 పెరిగి రూ.95,800కు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement