Today Gold And Silver Price In Delhi, Hyderabad 7th April 2021 - Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన బంగారం ధరలు

Apr 7 2021 5:24 PM | Updated on Apr 7 2021 10:13 PM

Today gold and silver price in delhi, hyderabad 7th april 2021 - Sakshi

బంగారం ధర గత ఏప్రిల్ 1 నుంచి వరుసగా పెరుగుతుంది. ఈ లెక్క చాలు బంగారం ధరలు పెరుగుతున్నాయి అని మనం అర్థం చేసుకోవడానికి. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే బంగారం ధర కూడా పెరుగుతూ పోతుంది. కేవలం ఏడూ రోజుల్లోనే బంగారం ధర రూ.1000 పెరగడం విశేషం. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో నేడు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,421 నుంచి రూ.45,904కు పెరిగింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,606 నుంచి 42,048కు పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.442 రూపాయలు పెరిగింది అన్నమాట.

ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.42,400 నుంచి రూ.42,650కు చేరుకుంది. నిన్నటి నుంచి ధర రూ.250 పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,250 నుంచి రూ.46,530కు పెరిగింది ఉంది. అంటే ఒక్కరోజులో రూ.280 రూపాయలు పెరిగింది అన్నమాట. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.65,600 నుంచి రూ.66,139కు పెరిగింది. బంగారం ధర హెచ్చుతగ్గులు అనేది ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు విషయాలపై ఆధారపడి ఉంటుంది.

చదవండి: చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే!

Advertisement
 
Advertisement
Advertisement