చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే! | Which bank is offering lowest interest rate on home loan | Sakshi
Sakshi News home page

చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే!

Apr 6 2021 6:13 PM | Updated on Apr 6 2021 6:27 PM

Which bank is offering lowest interest rate on home loan - Sakshi

మీరు మీ సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీ దగ్గర సొంతిల్లు కట్టుకోవడానికి సరిపడినంత డబ్బులు మీ వద్ద లేవా? అయితే మీకు ఒక శుభవార్త. చాలా బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. అయితే గృహ రుణాలను బ్యాంక్ నుంచి తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. హోమ్ లోన్ అనేది ఎక్కువ మొత్తంతో కూడుకున్న వ్యవహారం. అందుకే వడ్డీ రేట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వడ్డీ రేట్లు కొంచెం తగ్గిన దీర్ఘకాలంలో భారీ లాభం కనిపిస్తుంది. అందువల్ల వడ్డీ రేటు తక్కువున్న బ్యాంకులో లోన్ తీసుకోండి. మేము మీ కోసం చౌక వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకులు జాబితాను మీ కోసం అందిస్తున్నాం.

  • కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.65 శాతం  
  • ఐసీఐసీఐ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం 
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం
  • బ్యాంక్ ఆఫ్ బరోడా‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతం  
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.80 శాతం 
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.85 శాతం 
  • ఐడీబీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.90 శాతం
  • కెనరా బ్యాంక్‌ హోమ్ లోన్ వడ్డీ రేటు 6.90 శాతం
  • ఎస్‌బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.95 శాతం 
  • బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.95 శాతం

చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్‌బీఐ షాక్! 

Advertisement
 
Advertisement
Advertisement