పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Today Gold And Silver Price 30 November 2023 - Sakshi

నిన్న రూ. 850 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 650 వరకు తగ్గింది. ఈ రోజు బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5750, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6273గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 5750, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 62730గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 600, రూ. 650 తగ్గింది. గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.

చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధర రూ. 5865 (22 క్యారెట్స్), రూ. 6398 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 58650, రూ. 63980గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 50, రూ. 60 మాత్రమే తగ్గినట్లు స్పష్టమవుతోంది.

ఢిల్లీలో ఈ రోజు పసిడి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 5765, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6288గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ 600, రూ. 650 తగ్గింది. కాబట్టి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57650 (22 క్యారెట్స్), రూ. 62880కి (24 క్యారెట్స్) చేరింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో వెండి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top