TCS, Wipro and Infosys: Indian IT companies push for work from office - Sakshi
Sakshi News home page

IT Companies: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!

Jul 21 2023 8:08 AM | Updated on Jul 21 2023 9:35 AM

TCS Wipro and infosys companies push for work from office - Sakshi

భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటి నుంచి ఉద్యోగులు ఆఫీస్ బాట పడుతున్నారు. అయితే ఇప్పటికి కూడా కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని కొనసాగిస్తున్నారు. వీరిని కూడా సంస్థలకు తిరిగి రప్పించడానికి దిగ్గజ కంపెనీలు ఒకే మాట మీద నడుస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి ఒకే తాటిపై నడుస్తున్నట్లు సమాచారం. 2023-24 ఆర్ధిక సంవత్సరం క్యూ1 ఫలితాల తరువాత అందరిని సంస్థలకు రప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి.

క్యూ1 ఫలితాల అనంతరం అందరూ ఆఫీసులకు రావాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సుమారు 50 శాతం మంది ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. టీసీఎస్ కంపెనీలో 55 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు వస్తున్నట్లు 'మిలింద్ లక్కడ్' తెలిపారు. విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీలు కూడా ఇదే విధానం అమలు చేస్తున్నాయి.

(ఇదీ చదవండి: ఖాతాదారులకు గట్టి షాక్.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్‌బీఐ!)

మొత్తం మీద దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను రప్పించడానికి కంకణం కట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇంటికే పరిమితమై పనిచేసుకుంటున్న ఉద్యోగులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో 100 శాతం ఉద్యోగులు ఆఫీసులకు తప్పకుండా వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement