Tata Steel: 3000 మంది ఉద్యోగులకు 'టాటా' బైబై..!

Tata Steel 3000 Job Cuts In Wales - Sakshi

ఈ ఏడాది ప్రారంభం నుంచే గూగుల్, అమెజాన్ కంపెనీలు లేఆప్స్ ప్రారంభించాయి. ఈ జాబితాలోకి తాజాగా టాటా స్టీల్ చేరనున్నట్లు సమాచారం. ఈ కంపెనీ వేల్స్‌లోని ప్లాంట్‌లో సుమారు 3,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిసింది.

పోర్ట్ టాల్బోట్ స్టీల్‌వర్క్స్‌లోని రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లను కంపెనీ మూసివేసినట్లు.. ఇదే జరిగితే సుమారు మూడు వేలమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదు. లేఆప్స్ గురించి కూడా ప్రస్తావించలేదు.

టాటా స్టీల్ తన రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లను మూసివేయాలని నిర్ణయించే ముందు వర్కర్స్ యూనియన్‌తో సమావేశం నిర్వహించినట్లు, గ్రీన్ మెటల్ ఉత్పత్తికి నిధులు సమకూర్చడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఇప్పుడు పరిస్థితులు కొంత తీవ్రతరం కావడంతో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: యూపీఐ క్యూఆర్ కోడ్‌ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం! 

పోర్ట్ టాల్బోట్ స్టీల్‌వర్క్స్ అనేది యూకేలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటి. కంపెనీ ఇబ్బందులను ఎదుర్కుంటున్న సమయంలో బ్రిటన్ ప్రభుత్వం గత ఏడాది చివర్లో సంస్థకు 500 మిలియన్స్ ఫౌండ్స్ (రూ. 5300 కోట్లు) సహాయం చేసింది. ఆ సమయంలోనే కంపెనీ నష్టాలు ఉద్యోగులపైన ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top