శాటిలాజిక్‌తో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ జట్టు | Tata Advanced Systems and Satellogic Sign Strategic Contract to Build LEO Satellites in India | Sakshi
Sakshi News home page

శాటిలాజిక్‌తో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ జట్టు

Published Thu, Nov 30 2023 4:49 AM | Last Updated on Thu, Nov 30 2023 4:49 AM

Tata Advanced Systems and Satellogic Sign Strategic Contract to Build LEO Satellites in India - Sakshi

బెంగళూరు:  టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (టీఏఎస్‌ఎల్‌), అమెరికాకు చెందిన శాటిలాజిక్‌ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం భారత్‌లో లో ఎర్త్‌ ఆర్బిట్‌ (లియో) ఉపగ్రహాలను తయారు చేయనున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. ఇందుకోసం కర్ణాటకలోని తమ వేమగల్‌ ఫ్యాక్టరీలో టీఏఎస్‌ఎల్‌ ఉపగ్రహాల అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్‌ (ఏఐటీ) ప్లాంటును ఏర్పాటు చేనుంది.

దేశ రక్షణ బలగాలు, వాణిజ్య అవసరాల కోసం ఉపగ్రహాల తయారీ, ఇమేజరీ డెవలపింగ్‌ మొదలైన వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో వివరించాయి. పేలోడ్‌లు, ఇతర టెక్నాలజీ కోసం స్థానికంగా చిన్న, మధ్య తరహా సంస్థలతో (ఎస్‌ఎంఈ) కలిసి పని చేయనున్నట్లు టీఏఎస్‌ఎల్‌ సీఈవో సుకరణ్‌ సింగ్‌ తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ డిఫెన్స్, కమర్షియల్‌ మార్కెట్లోకి ప్రవేశించడం తమకు ఒక మైలురాయి కాగలదని శాటిలాజిక్‌ సీఈవో ఎమిలియానో కార్గీమ్యాన్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement