సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock market trend today closing and some stock prices raising | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Apr 25 2024 3:34 PM | Updated on Apr 25 2024 3:34 PM

Stock market trend today closing and some stock prices raising

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 156 పాయింట్లు లాభపడి 22,558 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 486 పాయింట్లు ఎగబాకి 74,339 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, నెస్లే, సన్ ఫార్మా, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఎం అండ్‌ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి వెళ్లాయి.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలివర్‌, టైటాన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement