నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Sep 9 2024 9:21 AM | Updated on Sep 9 2024 9:34 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 48 పాయింట్లు తగ్గి 24,807కు చేరింది. సెన్సెక్స్‌ 161 పాయింట్లు నష్టపోయి 81,012 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 101.17 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 71 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 3.72 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.7 శాతం, నాస్‌డాక్‌ 2.55 శాతం నష్టపోయాయి.

అమెరికా ఆగస్టు ద్రవ్యల్బోణ గణాంకాలు సెప్టెంబర్‌ 11న, దేశీయ ఆగస్టు రిటైల్‌ ద్రవ్యోల్బణ, జులై పారిశ్రామికోత్పత్తి డేటా గురువారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రొడ్యూసర్‌ ప్రెస్‌ ఇండెక్స్‌(పీపీఐ) సెప్టెంబర్‌ 14న వెల్లడి కానున్నాయి. అమెరికాలో ఉపాధి కల్పన తగ్గినట్లు డేటా వెలువడంతో ఫెడ్‌ రిజర్వ్‌ 50 బేసిస్‌ పాయింట్ల మేరకు వడ్డీరేట్లను తగ్గించే అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థిక మాంద్య భయాలు తెరపైకి వచ్చాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్‌ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్‌ తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement