గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మ్నార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో నిలిచాయి. సెన్సెక్స్ 1,533.72 పాయింట్లు లేదా 2.11 శాతం లాభంతో 74,315.61 వద్ద, నిఫ్టీ 374.65 పాయింట్లు లేదా 1.66 శాతం లాభంతో 22,997.35 వద్ద నిలిచాయి.
గాలంట్ ఇస్పాట్ లిమిటెడ్, సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, రైట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. యెస్ బ్యాంక్ లిమిటెడ్, ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


