స్టాక్ మార్కెట్లను మధ్య తరగతికి చేరువ చేసిన ధీరూభాయ్
ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ జియోతో సిద్ధమైన ముకేశ్ అంబానీ
అర్ధశతాబ్దం తరవాత మరో మెగా ఐపీఓకు సిద్ధమైన గ్రూపు
ముంబయి: దాదాపు 50 ఏళ్ల తరవాత... మరో చరిత్రకు రిలయన్స్ గ్రూపు సిద్ధమవుతోంది. స్టాక్ మార్కెట్లంటే సంపన్న ట్రేడర్లకు, కొన్ని వ్యాపార వర్గాలకే పరిమితమైన ఆ కాలంలో... రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లను మధ్య తరగతి కుటుంబాల్లోకి తీసుకొచ్చారు ధీరూభాయ్ అంబానీ. ఆ విప్లవంతో దేశంలో ఇన్వెస్ట్మెంట్ సంస్కృతే సమూలంగా మారిపోయింది. మళ్లీ ఇపుడు జియో ఐపీఓ ద్వారా ఆయన వారసుడు ముకేశ్ అంబానీ ఇన్వెస్టర్ల తలుపు తడుతున్నారు.
సామాన్యులు పెద్ద పెద్ద కంపెనీల వస్తువుల్ని కొనటం తప్ప ఆ కంపెనీ వాటాదార్లుగా ఎందుకు కాకూడదు? ధీరూభాయ్కి వచి్చన ఈ ఆలోచనే 1977లో రిలయన్స్ ఐపీఓకు దారి చూపించింది. రిలయన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ రూ.10 ముఖవిలువ కలిగిన షేరును ఆఫర్ చేయటంతో ఇష్యూ 7.19 రెట్లు ఓబర్ సబ్స్క్రయిబ్ అయ్యింది.
బంగారంలో, బ్యాంకు ఖాతాల్లో డబ్బు దాచుకునే పొదుపు సంస్కృతిని ఇది మార్చేసింది. చాలామంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలం తమ షేర్లు విక్రయించకుండా కొనసాగటంతో... వారూ రిలయన్స్ వృద్ధిలో భాగమయ్యారు. డివిడెండ్లు, బోనస్ షేర్లను కలుపుకుంటే ఈ 50 ఏళ్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లు సాధారణ వడ్డీకన్నా కొన్ని వందల రెట్లు లాభపడ్డారనే చెప్పాలి.
ఇపుడు జియో ఐపీఓ ద్వారా రిలయన్స్ మరో చరిత్రాత్మక ఘట్టానికి సిద్ధమయ్యింది. ధీరూభాయ్ వారసుడు ముకేశ్ అంబానీ సారథ్యంలో జియో దేశీ టెలికం స్థితిగతులనే మార్చేసిన జియో... డేటా ధరల్ని చుక్కల్లోంచి కిందికి దింపటంతో పాటు కోట్ల మందికి ఇంటర్నెట్ సరీ్వసులనూ అందిస్తోంది. ఈ నెల 21న ప్రారంభమయ్యే ఈ ఐపీఓ 23న ముగుస్తుంది.
వాస్తవానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వాటాదారులకు కూడా ఈ ఐపీఓ ద్వారా బాగా లబ్ధి చేకూరుతుందనే అంచనాలున్నాయి. ఎందుకంటే ఐపీఓ తరవాత కూడా జియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాయే ఎక్కువ. ఇపుడు జియో డిజిటల్ వ్యాపారాల్ని ఐపీఓ ద్వారా అన్లాక్ చేయటంతో ఆ విలువ రిలయన్స్ షేర్హోల్డర్లకూ దక్కుతున్నట్టే. నిజానికి రిలయన్స్ వారసత్వం ఇపుడు మూడో తరం చేతుల్లోకి వచి్చనట్లే.
ఎందుకంటే ఐపీఓకు వస్తున్న జియో ప్లాట్ఫామ్స్కు ఆకాశ్ అంబానీ నేతృత్వం వహిస్తుండగా గ్రూపు రిటైల్ వ్యాపారానికి ఇషా అంబానీ సారథ్యం వహిస్తున్నారు. అనంత్ అంబానీ ఆర్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతూ ఇతర రంగాల్లోకి విస్తరణను పర్యవేక్షిస్తున్నారు. నిజానికి రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ జియో మధ్య మరో సామీప్యం కూడా ఉంది. వ్యాపారాన్ని ప్రారంభించిన దశాబ్ద కాలంలోనే పబ్లిక్ ఇష్యూకు రావటం.
1966లో గుజరాత్ లోని నరోడాలో టెక్స్టైల్ మిల్లును స్థాపించిన «ధీరూభాయ్ అంబానీ... దాని ద్వారా విమల్ బ్రాండ్ను పరిచయం చేశారు. 11 ఏళ్ల తరవాత.. 1977లో కంపెనీని ఐపీఓకు తెచ్చారు. జియోది కూడా దాదాపుగా అలాంటి చరిత్రే. 2016 సెపె్టంబర్లో రిలయన్స్ జియో ఆరంభమయ్యింది. దాదాపు 10 ఏళ్ల తరవాత... 2026 అక్టోబర్లో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. బహుశా... చరిత్ర పునరావృత్తమవ్వటమంటే ఇదేనేమో!!.


