వరుస లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 155.30 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 74,160.31 వద్ద, నిఫ్టీ 12.65 పాయింట్లు లేదా 0.055 శాతం నష్టంతో 22,984.70 వద్ద సాగుతున్నాయి.
కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్, టెక్ మహీంద్రా లిమిటెడ్, వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్, ఎల్&టి ఫైనాన్స్ లిమిటెడ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఇదీ చదవండి: బీఎస్-7 వాహనాలపై కీలక అప్డేట్!


