క్యూ2 నికర లాభం రూ. 1,586 కోట్లు
షేరుకి రూ. 15 మధ్యంతర డివిడెండ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. అంటే వాటాదారువద్దగల ప్రతీ షేరుకీ మరో షేరు ఉచితంగా లభించనుంది. ఇందుకు తాజాగా సమావేశమైన కంపెనీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచి్చనట్లు టెక్ మహీంద్రా వెల్లడించింది. బోనస్‌కు రికార్డ్ డేట్ తదుపరి ప్రకటించనుంది. వెరసి 11 ఏళ్ల తదుపరి బోనస్ షేర్లు జారీ చేయనుంది. ఇంతక్రితం 2015 మార్చిలోనూ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు అందించింది.
కాగా.. ఒక్కో షేరుకీ రూ. 15 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు సైతం బోర్డు నిర్ణయించింది. ఇందుకు ఈ నెల 23 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. తాజా సమీక్షా కాలంలో 5,446 మంది ఉద్యోగులను జత చేసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,52,206కు చేరింది.
పటిష్ట ఫలితాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసికంలో టెక్ మహీంద్రా పటిష్ట ఫలితాలు సాధించింది. వార్షికంగా జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 33 శాతం జంప్‌చేసి రూ. 1,586 కోట్లకు చేరింది. గతేడాది(2025–26) ఇదే కాలంలో రూ. 1,195 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం ఎగసి రూ. 16,180 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 13,995 కోట్ల టర్నోవర్ అందుకుంది. త్రైమాసికవారీగా అంటే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)తో పోలిస్తే నికర లాభం 8 శాతం పుంజుకోగా ఆదాయం 3 శాతం బలపడింది.
ఈ కాలంలో 25 శాతం అధికంగా 102.3 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. గత నాలుగు క్వార్టర్లలో బిలియన్ డాలర్లకుపైగా విలువైన డీల్స్ గెలుచుకున్నట్లు టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ మోహిత్ జోషీ పేర్కొన్నారు. కస్టమర్లతో కంపెనీకున్న సత్సంబంధాలు, నమ్మకానికి ఇవి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కరెన్సీ నిలకడ ప్రాతిపదికన వార్షికంగా 7 శాతం వృద్ధిని సాధించడంతోపాటు.. బిజినెస్ మొమెంటమ్‌ను కొసాగించనున్నట్లు తెలియజేశారు. ఈ త్రైమాసికంలో 40వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు వెల్లడించారు.
ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు బీఎస్ఈలో 4.6 శాతం జంప్‌చేసి రూ. 1,649 వద్ద ముగిసింది.


