అమెజాన్ ఆంక్షలు.. మస్క్ కీలక వ్యాఖ్యలు! | Elon Musk Hints at Launching Amazon Rival Know The Details | Sakshi
Sakshi News home page

అమెజాన్ ఆంక్షలు.. మస్క్ కీలక వ్యాఖ్యలు!

Oct 16 2026 7:17 AM | Updated on Oct 16 2026 7:31 AM

Elon Musk Hints at Launching Amazon Rival Know The Details

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఆన్‌లైన్ షాపింగ్ చేయడంలో కూడా సహాయకారిగా ఉంటోంది. మనకు కావాల్సిన వస్తువులను వెతకడం, వాటి ధరలను పోల్చడం, ఆర్డర్లు చేయడం వంటి పనులలో ఏఐ అసిస్టెంట్ల సహాయపడుతున్నాయి. కానీ.. అమెజాన్ తన వెబ్‌సైట్‌లో ఏఐ బాట్‌లు వినియోగదారుల తరఫున షాపింగ్ చేయడంపై కొన్ని ఆంక్షలు విధిస్తోంది.

ఒక ఎక్స్ యూజర్ తన గ్రోక్ ఏఐ బాట్ అమెజాన్‌లో రిటర్న్స్ నిర్వహించడానికి ఉపయోగపడుతోందని.. అయితే, అమెజాన్ ఏఐ బాట్‌లను అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రజలు తమ ఏఐ అసిస్టెంట్ల ద్వారా షాపింగ్ చేయలేకపోతే.. మరో ఆన్‌లైన్ స్టోర్‌కు మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా.. ఎలాన్ మస్క్ కొత్తగా 'ఎక్స్ షాప్' పేరుతో ఒక ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు.

అమెజాన్‌కు పోటీ మస్క్ కంపెనీ?
దీనికి స్పందించిన మస్క్, అమెజాన్‌కు పోటీగా ఒక సంస్థను ప్రారంభిస్తే బాగుంటుందని అన్నారు. అయితే.. ఆ సంస్థ ఎలా పనిచేస్తుంది?, ఎప్పుడు ప్రారంభమవుతుంది?, అనే వివరాలను ఆయన వెల్లడించలేదు. కానీ.. అమెజాన్ తన వెబ్‌సైట్‌లో ఏఐ ఏజెంట్ల వినియోగంపై ఆంక్షలు విధించడానికి కారణం భద్రత, గోప్యత అని చెబుతోంది.

మెటా సంస్థకు చెందిన మ్యూస్ ఏఐ అసిస్టెంట్‌ను కూడా అమెజాన్‌లో వినియోగదారుల తరఫున షాపింగ్ చేయకుండా అడ్డుకుంటోందని కంపెనీ చెబుతోంది. దీనికి కారణం.. మ్యూస్ తమ అనుమతి లేకుండా వెబ్‌సైట్‌ను ఉపయోగించడంతో పాటు, వినియోగదారుల లాగిన్ వివరాలను సేకరించి స్టోర్ చేస్తున్నట్లు అమెజాన్ ఆరోపించింది.

ఆన్‌లైన్ షాపింగ్‌లో ఏఐ పాత్ర
దీన్నిబట్టి చూస్తే.. భవిష్యత్తులో ఆన్‌లైన్ షాపింగ్‌లో ఏఐ పాత్ర మరింత పెరగనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఉదాహరణకు.. మనకు ఒక ఫోన్ కొనాలని ఉంటే, మనమే వివిధ వెబ్‌సైట్లలో వెతకకుండా ఏఐ అసిస్టెంట్‌కు మన అవసరాలను చెబితే, అది ధరలు, ఫీచర్లను పోల్చి మంచి ఫోన్‌ను సూచిస్తుంది. అవసరమైన అనుమతులు ఉంటే కొనుగోలు ప్రక్రియలో కూడా సహాయం చేస్తుంది. ఇలాంటి సౌకర్యాలను అందించే సంస్థలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: SBI ఖాతాదారులకు షాక్.. పెరిగిన లోన్ వడ్డీ రేట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement