ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Sep 6 2024 9:32 AM | Updated on Sep 6 2024 10:47 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 25,148కు చేరింది. సెన్సెక్స్‌ 18 పాయింట్లు తగ్గి 82,146 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 101.05 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 72.68 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 3.73 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.3 శాతం, నాస్‌డాక్‌ 0.25 శాతం నష్టపోయాయి.

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్‌ 17-18 జరగనుంది. ఈరోజు రాత్రి యూఎస్‌ జాబ్స్‌ డేటా విడుదల కానుంది. ఒకవేళ అంచనాలకంటే ఎక్కువ ఉద్యోగాలు నమోదైతే రానున్న ఫెడ్‌ సమావేశంలో వడ్డీరేట్ల మార్పులో నిర్ణయాలుంటాయని భావిస్తున్నారు. అట్లాంటా ఫెడ్‌ అధ్యక్షుడు బోస్టిక్‌ తాజాగా వడ్డీరేట్లకు సంబంధించి ప్రస్తావించారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి వస్తేనే కీలక వడ్డీరేట్లను తగ్గిస్తామనే ధోరణి సరికాదన్నారు. గడిచిన సెషన్‌లో ఎఫ్‌ఐఐలు రూ.688.69 కోట్లు విలువైన షేర్లు అమ్మగా, డీఐఐలు రూ.2970.74 కోట్ల విలువగల స్టాక్స్‌ను  కొనుగోలు చేశారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement