ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Sep 3 2024 9:19 AM | Updated on Sep 3 2024 10:48 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 6 పాయింట్లు తగ్గి 25,272కు చేరింది. సెన్సెక్స్‌ 18 పాయింట్లు నష్టపోయి 82,556 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 101.67 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 77.22 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 3.92 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.01 శాతం, నాస్‌డాక్‌ 1.1 శాతం లాభపడ్డాయి.

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్‌ 17-18 జరగునుంది. ఈ నేపథ్యంలో ఫెడ్‌ వడ్డీరేట్లను ప్రభావితం చేసే యూఎస్‌ తయారీ రంగ, నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్‌ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 25,500 స్థాయిని పరీక్షించవచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 25,000 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,900 వద్ద మరో మద్దతు ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement