సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Apr 10 2024 3:34 PM | Updated on Apr 10 2024 3:34 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 22,753 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 354 పాయింట్లు ఎగబాకి 75,038 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, కోటక్‌ మహీంద్రాబ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీ​ంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్‌, టీసీఎస్‌, నెస్లే, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

మారుతీ సుజుకీ, ఎల్‌ అండ్‌ టీ, ఎం అండ్‌ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల బాటపట్టాయి.

ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానం

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement