సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Mar 13 2024 3:22 PM | Updated on Mar 13 2024 3:31 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 353 పాయింట్లు నష్టపోయి 21,981 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 906 పాయింట్లు దిగజారి 72,761 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, టైటాన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌యూఎల్‌, భారతిఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి.

విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా రూ.73.12 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,358.18 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement