సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌ సూచీలు

Mar 7 2024 3:31 PM | Updated on Mar 7 2024 3:42 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్‌ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 9 పాయింట్లు పెరిగి 74,095 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10 పాయింట్ల పెరిగి 22,484 వద్ద ముగిసింది.

బీఎస్ఈ 30 ఇండెక్స్‌లో టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఐటీసీ, టీసీఎస్‌, నెస్లే, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, విప్రో, ఎస్‌బీఐ, భారతి ఎయిర్‌టెల్ కంపెనీల షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, పవర్‌గ్రిడ్‌ స్టాక్‌ షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement