
స్టాక్ మార్కెట్ సూచీల్లో బుల్ జోరు కొనసాగింది. శుక్రవారం కూడా స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ అనుకూల పవనాలతో మార్కెట్లు గ్రీన్‌లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 969 పాయింట్ల పెరిగి 71,483 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 273 పాయింట్లు పెరిగి 21,456 స్థిర పడింది.
బీఎస్ఈ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, విప్రో, పవర్ గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, హిందుస్థాన్ యూనిలివర్, సన్ ఫార్మా లాభాల్లో ముగిశాయి.
యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, మారుతీ, భారతీ ఎయిర్ టెల్, నెస్లే ఇండియా నష్టాల్లో ట్రేడయ్యాయి. ఐటీ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. హెచ్‌సీఎల్ టెక్ 5.62 శాతం, టీసీఎస్ 5.53 శాతం, ఇన్ఫోసిస్ 5.11 శాతం, టెక్ మహీంద్రా 3.44 శాతం పెరిగాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ నేతృత్వంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4 శాతం ఎగబాకింది.
అమెరికా బాండ్ రాబడి తగ్గుదల, భారత జీడీపీ వృద్ధి అంచనాలు, తగ్గుతున్న చమురు ధరలతో స్టాక్ మార్కెట్‌లో సానుకూల పవనాలు వీస్తున్నాయి. దాంతో మార్కెట్లు ఆల్‌టైంహైకు చేరుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)