భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 27th January 2025 | Sakshi
Sakshi News home page

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Jan 27 2025 3:40 PM | Updated on Jan 27 2025 3:43 PM

Stock Market Closing Update 27th January 2025

సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 838.43 పాయింట్లు లేదా 1.10 శాతం నష్టంతో 75,352.03 వద్ద.. నిఫ్టీ 274.90 పాయింట్లు లేదా 1.19 శాతం నష్టంతో 22,817.30 వద్ద నిలిచాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందూస్తాన్ యూనీలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. HCL టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement
 
Advertisement
Advertisement