
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం నుంచి మార్కెట్లు ముగిసే వరకు లాభాల్లో ట్రేడయ్యాయి. ఒడుదొడుకుల మధ్య కదలాడిన నిఫ్టీ చివరికి 20,997 వద్దకు చేరింది. సెన్సెక్స్ 69,928 వద్ద స్థిరపడింది.
రెండో త్రైమాసికంలో అంచనావేసిన దానికంటే మెరుగైన జీడీపీ నమోదవుతుందంటూ ఆర్‌బీఐ చెప్పడంతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను తాకుతోంది. యుఎస్ ఫెడ్ పాలసీ సమావేశం ఫలితాలు బుధవారం రానున్నాయి. భవిష్యత్తులో వడ్డీరేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గురువారం సమావేశం కానున్నాయి.
సెన్సెక్స్-30లో ఆల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. యాక్సిస్‌బ్యాంక్, ఎం అండ్ ఎం, హెచ్‌యూఎల్, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నష్టాల్లో ట్రేడయ్యాయి.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 35,638.01 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. అయితే చివరకు 0.91 శాతం పెరిగి 35,610.50 వద్ద ముగిసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.71 శాతం లాభంతో ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)