Salary Hikes In 2022: ప్రైవేట్ ఉద్యోగుల‌కు బంప‌రాఫ‌ర్‌, ఈ ఏడాది పెర‌గ‌నున్న 75శాతం జీతాలు!!

Startups Set To Pay Hikes In 2022 Up To 75percent Salary Hikes - Sakshi

ప్రైవేట్ ఉద్యోగుల‌కు బంప‌రాఫ‌ర్‌. ఈ ఏడాది పలు స్టార్ట‌ప్ కంపెనీల్లో ప‌నిచేసే ఉద్యోగులకు ఆయా కంపెనీలు భారీ ఎత్తున జీతాలు పెంచేందుకు స‌న్న‌ద్ధ‌మైన‌ట్లు ప‌లు నివేదిక‌లు వెలుగులోకి వ‌చ్చాయి. 

ఉద్యోగులు కోవిడ్ కార‌ణంగా భారీ ప్యాకేజీ అందించే సంస్థ‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉద్యోగులు  బయటికి వెళ్లకుండా ఉండేందుకు ప్రస్తుత కంపెనీలు భారీ స్థాయిలో ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాయి.  

దీంతో  ఆయా కంపెనీల్లో తక్కువ వేతనాలున్న ఉద్యోగుల జీతాలు రెండింత‌లు పెర‌గ‌నున్నాయి.  వారికి, రెమ్యూనరేషన్లు రెండింతలు పెరగనున్నాయి. ఇప్ప‌టికే  షిప్‌రాకెట్, అప్‌గ్రేడ్, సింప్లీలెర్న్, క్రెడ్‌అవెన్యూ, హోమ్‌లేన్, నోబ్రోకర్, క్యాష్‌కరో వంటి స్టార్టప్‌లు 2022లో సగటు వేతన పెంపులు కరోనా ముందటి స్థాయిల కంటే ఎక్కువగా ఉంటాయని ప్రకటించాయి.

ఇక తాజాగా మ‌రికొన్ని స్టార్టప్ కంపెనీలు సగటున 15 శాతం నుంచి 25 శాతం వరకు జీతాల్ని పెంచ‌నున్నాయి. సాధార‌ణ ఉద్యోగుల‌తో పాటు ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న ఉద్యోగుల‌కు భారీ స్థాయిలో 75 శాతం వరకు జీతాల్ని ఆఫ‌ర్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఈ మేరకు ప్రకటనలు చేసిన‌ట్లు ప‌లు నివేదిక‌లు పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top