Tata Starbucks opens store in Visakhapatnam - Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో స్టార్‌బక్స్‌.. నోరూరించే మెనూ!

Jul 6 2023 8:48 AM | Updated on Jul 6 2023 9:37 AM

Starbucks opens store in Vizag - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కాఫీ విక్రయాల్లో ఉన్న టాటా స్టార్‌బక్స్‌ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో స్టోర్‌ను తెరిచింది. దీంతో దేశవ్యాప్తంగా సంస్థ కేంద్రాలున్న నగరాల సంఖ్య 45కు చేరుకుంది. ఏపీలో ఇప్పటికే కంపెనీకి విజయవాడలో ఔట్‌లెట్‌ ఉంది. టాటా కంజ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ సంయుక్త భాగస్వామ్యంలో 2012లో భారత్‌లో ప్రవేశించిన స్టార్‌బక్స్‌కు దేశవ్యాప్తంగా 350 స్టోర్లు ఉన్నాయి. 

ఈ స్టోర్‌లో అనుకూలమైన ఎంపికల శ్రేణిని టాటా స్టార్‌బక్స్ పరిచయం చేస్తోంది. కొత్త పిక్కో కప్ సైజుతో సహా, కాఫీ ప్రియులకు ఫేవరెట్‌ పానీయాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఫిల్టర్ కాఫీ, మసాలా చాయ్, ఏలకుల చాయ్, మిల్క్‌షేక్‌లు, శాండ్‌విచ్‌లను ఆకర్షణీయమైన ఆఫర్‌లతో అందిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement