అందుకే.. అమెరికా విడిచి వచ్చేయండి! | Sridhar Vembu Urges Indian Techies After US Green Card Freeze | Sakshi
Sakshi News home page

అందుకే.. అమెరికా విడిచి వచ్చేయండి!

Oct 9 2026 3:31 PM | Updated on Oct 9 2026 3:44 PM

Sridhar Vembu Urges Indian Techies After US Green Card Freeze

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు గ్రీన్ కార్డ్ విషయంలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ వంటి ప్రముఖ కంపెనీలకు సంబంధించిన 'పీఈఆర్ఎమ్' (పెర్మనెంట్ లేబర్ సరిఫికేషన్ ప్రోగ్రామ్) ప్రక్రియపై అమెరికా కార్మిక శాఖ ఆంక్షలు విధించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాలపై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) స్పందిస్తూ.. అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చి, దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పీఈఆర్ఎమ్ ప్రక్రియ
గ్రీన్ కార్డ్ అంటే.. అమెరికాలో శాశ్వతంగా నివసించేందుకు అనుమతించే హోదా. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న చాలామంది భారతీయులు భవిష్యత్తులో గ్రీన్ కార్డ్ పొందాలని ఆశిస్తుంటారు. అయితే.. ఈ ప్రక్రియలో పీఈఆర్ఎమ్ అనే దశ చాలా కీలకం. దీని ప్రకారం, ఒక విదేశీ ఉద్యోగిని శాశ్వతంగా నియమించుకునే ముందు, ఆ ఉద్యోగానికి సరైన అర్హతలున్న అమెరికా ఉద్యోగులు అందుబాటులో లేరని యజమాని నిరూపించాల్సి ఉంటుంది.

అమెరికా కార్మిక శాఖ ఆరోపణల ప్రకారం.. కొన్ని కంపెనీలు పీఈఆర్ఎమ్ విధానాన్ని సక్రమంగా ఉపయోగించలేదనే అనుమానాలు ఉన్నాయి. అందువల్ల కొత్త దరఖాస్తులను స్వీకరించకపోవడం, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే.. ఈ చర్య వల్ల ఆ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల H-1B వీసాలు ఆటోమేటిక్‌గా రద్దు కావు. ప్రధానంగా గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఉన్నవారికి ఆలస్యం, అనిశ్చితి ఎదురయ్యే అవకాశం ఉంది.

భారతీయుల పట్ల వ్యతిరేక భావన
అమెరికా సాంకేతిక అభివృద్ధిలో భారతీయులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. భారతీయ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, పరిశోధకులు తమ ప్రతిభతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు, సాంకేతిక రంగానికి గణనీయమైన సేవలు అందించారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. ఇంతటి సేవలు అందించినప్పటికీ అమెరికాలోని కొంతమంది భారతీయుల పట్ల వ్యతిరేక భావన పెరుగుతోందనే ఆందోళనను శ్రీధర్ వెంబు వ్యక్తం చేశారు.

కష్టపడి సంపాదించిన నైపుణ్యాలను భారతదేశ అభివృద్ధికి ఉపయోగించాలని, దేశంలోనే కొత్త సంస్థలను స్థాపించి సాంకేతిక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని వెంబు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: భారత్‌ స్టార్‌లింక్‌ పంచాయితీలో బిగ్‌ ట్విస్ట్‌!

భారతదేశంలోనే మంచి కంపెనీలను స్థాపించి, కొత్త ఉద్యోగాలను సృష్టించి, ప్రపంచ స్థాయిలో పోటీపడే సాంకేతిక సంస్థలను నిర్మించాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో సంపాదించిన అనుభవం, పరిజ్ఞానం మన దేశానికి ఉపయోగపడితే భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని వెంబు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement