గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది అంతే! ఎలన్‌ మస్క్‌ యుద్ధం వచ్చినా ఆగేలా లేడే!

SpaceX Launches 48 New Starlink Satellites Successfully Into Orbit - Sakshi

స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ ప్రయోగాలతో ముందుకు సాగుతున్నాడు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం పరిణామాలు తన కలల్ని చిన్నాభిన్నం చేస్తున్నా ప్రయోగాలు మాత్రం ఆపడం లేదు. చిన్న గ్యాప్‌ ఇచ్చీ మళ్లీ మొదలు పెట్టాడు. తాజాగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ కోసం ఎలన్‌ మస్క్‌ 48 స్టార్‌లింక్‌ శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్‌లోకి పంపించారు.    

గత కొన్నేళ్లుగా అమెరికన్‌ బిజినెస్‌ టైకూన్‌ ఎలన్‌ మస్క్‌ తక్కువ కనెక్టివిటీలో సైతం ఇంటర్నెట్‌ను అందించేందుకు శాటిలైట్‌ ఇంటర్నెట్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప‍్రయోగాల్లో భాగంగా చివరి సారిగా ఫిబ్రవరి 3న 49 స్టార్‌లింక్‌ శాటిలైట‍్లను నింగిలోకి పంపారు. అందులో 38రాకెట్లు కూలిపోయాయి. అయినా ప్రయోగాల్ని ఎక్కడా నిలిపేయలేదు.రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ఏ విధంగా ఉపయోగ పడిదో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇప్పుడు అదే జోరుతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమయ్యారు.  

ఈ నేపథ్యంలో ఫ‍్లోరిడాలోని స్పేస్‌ స్టేషన్‌ నుంచి టూ స్టేజ్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌తో 48శాటిలైటన్లు ఆర్బిట్‌లోకి పంపినట్లు ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశాడు. కాగా, శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించేందుకు ఎలన్‌ మస్క్‌ 2019 నుంచి ఇప్పటి వరకు 2వేల స్టార్‌లింగ్‌ శాటిలైట్‌లను నింగిలోకి పంపారు. మరో 12వేల శాటిలైట్లపై ప‍్రయోగించేందుకు అనుమతి పొందగా.. మరో 30వేల రాకెట్లను ప్రయోగించేందుకు అనుమతి కోసం అప్లయ్‌ చేసినట్లు సమాచారం.   

చదవండి: జాక్‌పాట్‌!! అమెరికా ప్రెసిడెంట్‌గా ఎలన్‌ మస్క్‌?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top