పబ్‌జీ గేమింగ్‌ ప్రియులకు శుభవార్త

South Korean Krafton Inc Pubg Name Change In India  - Sakshi

న్యూఢిల్లీ: గేమింగ్‌ ప్రియులకు పబ్‌జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై పబ్‌జీ అంటూ వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే అంత క్రేజ్‌ ఉన్న పబ్‌జీ గేమ్‌ చైనాది కావడంతో గతేడాది సెప్టెంబర్‌ 2న కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. భారత్‌-చైనాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదంతో కేంద్రం పబ్‌జీ తో పాటూ 118 మొబైల్ యాప్‌లు దేశ భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయంటూ వాటిని కూడా బ్లాక్‌ చేసింది. 

అప్పటి నుంచి పబ్‌జీ ప్రియులు ఆ గేమ్‌ భారత్‌ లో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో పబ్‌జీ సంస్థ తన ఆడియన్స్‌ కోసం అప్పుడప్పుడు చిన్నచిన్న అప్‌ డేట్‌లతో వాళ్లలో ఆశలు రేకెత్తించేలా చేసింది. తాజాగా పబ్‌జీ మాతృసంస్థ పబ్‌జీ పేరును బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా గా మారుస్తు కొత్త పోస్టర‍్లను విడుదల చేసింది. అందుకు సంబంధించి పబ్‌జీ సంస్థ తన సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టర్లను షేర్‌ చేసింది. దీంతో పబ్‌జీ గేమ్‌ త్వరలో ఇండియాలో విడుదల కాబోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

ఈ సంస్థ గత కొంత కాలంగా భారతదేశంలో తన గేమ్‌ను తిరిగే ప్రారంభించేందుకు ఉద్యోగుల నియామకాన్ని ప్రారంభించింది. క్రాఫ్టన్ సంస్థ ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ లింక్డిన్‌ లో పోస్టింగ్‌ లను అప్‌ డేట్‌ చేస్తుంది. వారం రోజుల క్రితం గవర్నమెంట్‌ రిలేషన్‌ మేనేజర్‌ పోస్ట్‌ కు రిక్రూట్‌ మెంట్‌ నిర్వహించింది. దీంతో పాటు ప్రధాని మోడీ పీఎం కేర్స్‌ కు రూ.1.5కోట్లు విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా క్రాఫ్టన్‌ సీఈఓ చాంగ్హాస్‌ కిమ్‌ మాట్లాడుతూ.." భారత్‌ కరోనాపై పోరాటం చేస్తుంది. మా వంతు సాయంగా భారత్‌ ను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతేకాదు కరోనా కేసులు నివారణకు చేస్తున్న సహాయక చర్యల‍్లో అండగా నిలుస్తామని" అన్నారు.

చదవండి:

ఎస్​బీఐ ఖాతాదారులకు మరో గుడ్​న్యూస్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top