Sona Comstar to Acquire 54% Stake in Serbia Company Novelic - Sakshi
Sakshi News home page

సెర్బియా కంపెనీలో సోనాకు వాటాలు

Jan 10 2023 11:58 AM | Updated on Jan 10 2023 12:42 PM

Sona Comstar To Acquire 54pc Stake In Serbia Company Novelic - Sakshi

ఆటో విడిభాగాల తయారీ సంస్థ సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్‌ ఫోర్జింగ్స్‌ (సోనా కామ్‌స్టార్‌) తాజాగా సెర్బియాకు చెందిన నోవెలిక్‌లో 54 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ 40.5 మిలియన్‌ యూరోలు (సుమారు రూ. 356 కోట్లు). అధునాతన డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌ (ఏడీఏఎస్‌) సెన్సార్స్‌ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఆటోమోటివ్‌ పరిశ్రమలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ విభాగం 2030 నాటికి 43 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి.

 వాటాల కొనుగోలు డీల్‌ 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సోనా కామ్‌స్టార్‌ ఎడీ వివేక్‌ విక్రమ్‌ సింగ్‌ తెలిపారు. తదుపరి దశ వృద్ధి కోసం సోనాతో భాగస్వామ్యం ఉపయోగపడగలదని నోవెలిక్‌ సహ వ్యవస్థాపకుడు వెల్కో మిహాయ్‌లోవిక్‌ చెప్పారు. గతేడాది నోవెలిక్‌ ఆదాయం 9.3 మిలియన్‌ యూరోలుగా ఉండగా, లాభం 2.5 మిలియన్‌ యూరోలుగా నమోదైంది. 

చదవండి: సిబిల్‌ స్కోరు గురించి ఈ విషయాలు తెలియక.. తిప్పలు పడుతున్న ప్రజలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement