సిబిల్‌ స్కోరు గురించి ఈ విషయాలు తెలియక.. తిప్పలు పడుతున్న ప్రజలు!

Easy Steps To Improve Cibil Score For Loan Purpose - Sakshi

ప్రస్తుత రోజుల్లో రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే లోన్లు ఇ‍వ్వడంలో కీలకంగా వ్యవహరించేది సిబిల్‌ స్కోరు. ఇందులో మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్‌ వివరాలు వీటితో పాటు పాత, లేదా ప్రస్తుత రుణ వివరాలు వంటి సమాచారం మొత్తం ఉంటుంది. అందుకే బ్యాంకులు, లోన్లు మంజూరు చేసే ప్రైవేటు కంపెనీలు సిబిల్‌ స్కోరును ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటాయి. అంతేకాదు మనకు రుణాలు మంజూరు కావడంతో సిబిల్‌ స్కోరు కీలకంగా కూడా వ్యవహరిస్తుంది.

సాధారణంగా సిబిల్ స్కోర్ 0 నుంచి 900 వరకు ఉంటుంది. మనం లోన్లు పొందాలంటే ఈ స్కోరు 700 కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు రుణాల మంజూరు సులభంగా జరుగుతాయి. కొన్ని కారణంగా వల్ల ఒక్కోసారి ప్రజలకు తెలియకుండానే ఈ సిబిల్‌ స్కోరు తగ్గుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సిబిల్‌ స్కోరును పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఆ అవేంటో చూద్దాం.

స్కోరు ఇలా పెంచుకోండి
క్రెడిట్ కార్డ్‌ యూజర్లు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.. ఆ కార్డు పూర్తి క్రెడిట్ పరిమితిని వాడకూడదు. మీ మొత్తం క్రెడిట్ పరిమితిలో 30% కంటే ఎక్కువ లోన్ తీసుకోకూడదు. ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీటితో పాటు మీరు లోన్ రీపేమెంట్ తక్కువ కాలం ఎంచుకోకండి. సరైన సమయంలో చెల్లంచని పక్షంలో స్కోరు తగ్గే అవకాశం ఉంది.  మీరు ఎక్కువ కాల వ్యవధిని ఎంచుకుంటే,  తక్కువ EMIలను చెల్లించాలి. ఇంకా అలాగే, దాని సాధారణ చెల్లింపు మీకు చాలా సులభం అవుతుంది. మీ ఆదాయంలో క్రెడిట్ రీపేమెంట్ వాటా అనేది తక్కువగా ఉంటుంది. ఇక మీ ఆదాయం లోన్ మొత్తం కంటే ఎక్కువ కానట్లయితే, మీరు దీర్ఘకాలిక లోన్ చెల్లింపు ఎంపికను ఎంచుకోవడం ద్వారా మీ సిబిల్ రేటింగ్‌ను పెంచుకోవచ్చు.

ఒకేసారి చాలా రుణాలు తీసుకోవడం మీ క్రెడిట్ రేటింగ్‌పై నెగిటివ్‌ మార్క్‌ పడుతుంది. ఎక్కువ రుణాలు తీసుకుంటే వాటి వాయిదాలను సకాలంలో చెల్లించడం చాలా కష్టమవుతుంది. ఇది మీ CIBIL స్కోర్‌పై ఖచ్చితంగా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలో మీరు సులభంగా తిరిగి పేమెంట్‌ చేయగల రుణం మాత్రమే తీసుకోవాలి. ఇక మీరు కొత్త రుణం తీసుకోబోతున్నట్లయితే, దానికి ముందు ఏదైనా బకాయిలు ఉంటే చెల్లించడం ఉత్తమం. ఎందుకంటే ఇది మీ మొత్తం ఆదాయంలో రుణ చెల్లింపు వాటాను తగ్గిస్తుంది. మీ ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడంలో కనుక ఖర్చు చేస్తుంటే, బ్యాంకు మీకు కొత్త లోన్ ని సులభంగా ఇవ్వడానికి ఇష్టపడదు.

చదవండి: అమెజాన్‌ ఆఫర్‌: ఇలా చేస్తే రెడ్‌మీ ఏ1 స్మార్ట్‌ఫోన్‌ రూ.1000లోపు సొంతం చేసుకోవచ్చు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top