Snapchat: సోషల్‌ మీడియాలో 'దమ్‌ మారో దమ్‌'..యువతకు చెక్‌ పెట్టేలా

Snapchat launch a new tool Protect People From Looking Up Drugs  - Sakshi

ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఇన్‌స్టాగ్రామ్‌పై వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో సోషల్‌ మీడియా సైట్స్‌లలో డ్రగ్స్‌ అమ్మకాలు పెరిగిపోతున్నాయనే కొన్ని రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం తన మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని భావించిన స్నాప్‌ చాట్‌ కొత్త టూల్‌ను లాంఛ్‌ చేసింది.       

అమెరికన్‌ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫాం స్నాప్‌ చాట్‌ విమర్శల్ని మూటగట్టుకుంది. ఈ ఏడాది సమ్మర్‌ సీజన్‌లో పిల్లల మరణాలపై నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారుల విచారణ చేపట్టారు. ఈ విచారణలో స్నాప్‌ చాట్‌లో నకిలి డ్రగ్స్‌ అమ్ముకాలు జరిగినట్లు గుర్తించారు.ఆ మందులు తీసుకోవడం వల్లనే పిల్లలు మరణించారనే ఆధారాలు వెలుగులోకి రావడంతో స్నాప్‌ చాట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ వివాదం చల్లారక ముందే  గత వారం యుఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) అధికారులు సోషల్‌ నెట్‌ వర్క్‌లలో ఫెంటానిల్,మెథాంఫేటమిన్ నకిలి డ్రగ్స్‌ అమ్మకాలు పెరిగిపోతున్నాయంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్నాప్‌ చాట్‌ నష్టనివారణకు సిద్ధమైంది

కొత్త టూల్‌
యూజర్లు స్నాప్‌ చాట్‌లో ఏ అంశం గురించి సెర్చ్‌ చేస్తున్నారు? సెర్చ్‌లో ప్రమాదకరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా' వంటి అంశాల్ని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో టూల్‌ను లాంఛ్‌ చేసింది. దీంతో యూజర్లు ఎవరైనా డ్రగ్స్‌ గురించి వెతికితే అలర్ట్‌ చేస్తుంది. వెంటనే యూజర్ల అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది.  

చదవండి: తీవ్ర విమర్శలు.. వెనక్కి తగ్గిన జుకర్‌బర్గ్ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top