బ్రాండ్ వాల్యూ: నాయిస్‌ మేకర్‌గా కింగ్ ఆఫ్ క్రికెట్ కోహ్లీ  | Smartwatch Leader Noise Signs Virat Kohli As New Brand Ambassador | Sakshi
Sakshi News home page

బ్రాండ్ వాల్యూ: నాయిస్‌ మేకర్‌గా కింగ్ ఆఫ్ క్రికెట్ కోహ్లీ 

Dec 2 2022 9:11 PM | Updated on Dec 2 2022 9:24 PM

Smartwatch Leader Noise Signs Virat Kohli As New Brand Ambassador - Sakshi

సాక్షి,ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ దూసుకు పోతోంది. స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ నోయిస్ కింగ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా, విరాట్ కోహ్లీని కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుది. నాయిస్  కంపెనీ  స్మార్ట్ వాచ్ లకు కోహ్లీ వ్యవహరించ నున్నాడు. బ్రాండ్ అంబాసిడర్‌గా  నాయిస్ ఉత్పత్తులకు కోహ్లీ అన్ని రకాలుగా ప్రచారకర్తగా ఉంటారు. 

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లిని నోయిస్ మేకర్‌గా  స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉందని నోయిస్ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ఖత్రి వ్యాఖ్యానించారు. స్మార్ట్‌వాచ్ డొమైన్‌లో నాయిస్‌ ప్రపంచవ్యాప్త అభిమానుల అభిమానంగా మారడానికి టీమిండియా దిగ్గజం విరాట్‌తో జోడీ పనిచేస్తుందన్నారు. పవర్-ప్యాక్డ్ పనితీరును అందించాల్సిన అవసరం తోపాటు, విరాట్‌తో  ఇండియా తోపాటు విదేశాలలో ఉన్న యువ ప్రేక్షకులతో తమ అనుబంధాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు.

ఈ ఒప్పందంపై కోహ్లీ  స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. తానిపుడు అధికారికంగా నోయిస్ మేకర్‌గా మారాననీ, భారత్ లో నెం.1 స్మార్ట్ వాచ్ బ్రాండ్ లో తానూ  ఒక భాగమేనని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement