హోల్డింగ్‌ కంపెనీగా శ్రీరామ్‌ ఫైనాన్షియల్‌ వెంచర్స్‌ | Shriram Capital, Shriram City Union Finance to merge with Shriram Transport Finance | Sakshi
Sakshi News home page

హోల్డింగ్‌ కంపెనీగా శ్రీరామ్‌ ఫైనాన్షియల్‌ వెంచర్స్‌

Nov 24 2022 6:31 AM | Updated on Nov 24 2022 6:31 AM

Shriram Capital, Shriram City Union Finance to merge with Shriram Transport Finance - Sakshi

చెన్నై: శ్రీరామ్‌ గ్రూపు హోల్డింగ్‌ కంపెనీగా ఇప్పటి వరకు ఉన్న శ్రీరామ్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌తోపాటు శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌.. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌లో విలీనం కానున్నట్టు శ్రీరామ్‌ గ్రూపు ప్రకటించింది. శ్రీరామ్‌ క్యాపిటల్‌కు హోల్డింగ్‌ కంపెనీ అయిన శ్రీరామ్‌ ఫైనాన్షియల్‌ వెంచర్స్‌ (చెన్నై) ప్రైవేటు లిమిటెడ్‌.. విలీనానంతర కంపెనీకి ప్రమోటర్‌గా మారుతుందని, ఫైనాన్షియల్, బీమా సేవలన్నీ దీని కింద ఉంటాయని ప్రకటించింది.

శ్రీరామ్‌ ఫైనాన్షియల్‌ వెంచర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌(ఎస్‌ఎఫ్‌వీపీఎల్‌)కు సహ యజమానులుగా శ్రీరామ్‌ ఓనర్‌షిప్‌ ట్రస్ట్, దక్షిణాఫ్రికాకు చెందిన సన్లామ్‌ గ్రూపు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఎస్‌ఎఫ్‌వీపీఎల్‌కు వైస్‌ చైర్మన్, ఎండీగా శ్రీరామ్‌ క్యాపిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన డీవీ రవి వ్యవహరిస్తారు. శ్రీరామ్‌ క్యాపిటల్‌ సీఎఫ్‌వో శుభశ్రీ శ్రీరామ్, నోవాక్‌ టెక్నాలజీ డైరెక్టర్, సీఈవో ఎన్‌ఎస్‌ నంద కిషోర్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ల బాధ్యతలు చేపడతారని శ్రీరామ్‌ ఫైనాన్షియల్‌ వెంచర్స్‌ ప్రకటించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement