breaking news
shriram city union finance ltd
-
హోల్డింగ్ కంపెనీగా శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్
చెన్నై: శ్రీరామ్ గ్రూపు హోల్డింగ్ కంపెనీగా ఇప్పటి వరకు ఉన్న శ్రీరామ్ క్యాపిటల్ లిమిటెడ్‌తోపాటు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్.. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌లో విలీనం కానున్నట్టు శ్రీరామ్ గ్రూపు ప్రకటించింది. శ్రీరామ్ క్యాపిటల్‌కు హోల్డింగ్ కంపెనీ అయిన శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ (చెన్నై) ప్రైవేటు లిమిటెడ్.. విలీనానంతర కంపెనీకి ప్రమోటర్‌గా మారుతుందని, ఫైనాన్షియల్, బీమా సేవలన్నీ దీని కింద ఉంటాయని ప్రకటించింది. శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్(ఎస్ఎఫ్వీపీఎల్)కు సహ యజమానులుగా శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్, దక్షిణాఫ్రికాకు చెందిన సన్లామ్ గ్రూపు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఎస్ఎఫ్వీపీఎల్కు వైస్ చైర్మన్, ఎండీగా శ్రీరామ్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డీవీ రవి వ్యవహరిస్తారు. శ్రీరామ్ క్యాపిటల్ సీఎఫ్‌వో శుభశ్రీ శ్రీరామ్, నోవాక్ టెక్నాలజీ డైరెక్టర్, సీఈవో ఎన్ఎస్ నంద కిషోర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ల బాధ్యతలు చేపడతారని శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ ప్రకటించింది. -
భారీ చోరీతో ఉలిక్కిపడ్డ మధిర
మధిర, న్యూస్‌లైన్ : మధిర పట్టణంలోని శ్రీరాం సిటీయూనియన్ ఫైనాన్స్ కార్యాలయంలో గురువారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ కలకలం సృష్టించింది. ఈ సంఘటనలో 11.5కేజీల బంగారం, రూ.6ల క్షల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మొత్తం 3.5కోట్ల సొత్తు చోరీ అయినట్లు చెబుతున్నారు. అయితే ఈ చోరీయావత్తు మిస్టరీగా మారింది. ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని ఒక వ్యక్తి కార్యాలయానికి ఎడమవైపున ఉన్న కిటికీ చువ్వలను తొలగించి లోపలికి ప్రవేశించాడు. కార్యాలయంలో ఉన్న టేబుల్ డెస్క్‌లను వెతగ్గా కొన్ని తాళపుచెవులు దొరికాయి. వాటిని తీసుకుని లాకర్‌గదిలోకి ప్రవేశించాడు. అయితే అతను లాకర్ గదిలోకి ప్రవేశించినప్పటినుంచి సీసీ కెమెరాలో నమోదైంది. సీసీ కెమెరాను పరిశీలించకుండా అతనిపని అతను చేసుకున్నాడు. దొరికిన తాళపు చెవులతో చిన్నలాకర్ను తెరచి అందులో ఉన్న బంగారాన్ని, నగదును సంచుల్లోకి సర్దుకున్నాడు. అయితే పెద్ద లాకర్‌కు సంబంధించిన ఒక తాళపుచెవి లేకపోవడంతో ఎంతసేపు ప్రయత్నించినప్పటికీ లాకర్ తెరుచుకోలేదు. ఇనుపరాడ్డుతో పగులకొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యంకాలేదు. దీంతో అతను దొరికినవరకు దోచుకుని అక్కడినుంచి ఉడాయించా డు. ఈ తతంగం మొత్తం సుమారు 2గంటలపాటు కొనసాగింది. గురువారం అర్ధరా త్రి 1.10గంటల సమయంలో లాకర్‌గదిలోకి ప్రవేశించిన నిందితుడు చోరీచేసిన బంగా రం, నగదు ఉన్న సంచులను తీసుకుని తిరిగి 2.48గంటలకు తాపీగా వెళ్లిపోయాడు. నింది తుడు లోపలికి ప్రవేశించినప్పటినుంచి ప్రతి కదలిక సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నో అనుమానాలు... ఈ చోరీ జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజూ లాకర్లో పెట్టిన బంగారపు వస్తువులు, నగదుకు సంబంధించిన వివరాలను రిజిస్టర్లో నమోదుచేసి చిట్‌ఫండ్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్, జూనియర్ నగదు అధికారి ఇద్దరూ కార్యాలయానికి తాళాలువేసి చెరో తాళపుచెవి తీసుకుని వెళతారు. అయితే గురువారం అర్ధరాత్రి ఇరువురివద్ద ఉండే తాళపు చెవులను కార్యాలయంలోనే ఉంచి వెళ్లడం గమనార్హం. అదేవిధంగా సెక్యూరిటీగార్డు కూడా గురువారం అర్ధరాత్రి విధులకు హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చోరీకి పాల్పడిన వ్యక్తి చేతికి గ్లౌజులు, ముఖం కనబడకుండా రుమాలు చుట్టుకుని రావడాన్నిబట్టి చూస్తే చోరీల సంఘటనలో ఆరితేరిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది జనవరి మొదటివారంలో ఇదే కార్యాలయంలో చోరీ జరిగింది. అప్పుడు బంగారం, నగదు అపహరణ జరగకపోయినప్పటికీ తాకట్టుకు సంబంధించిన డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. గురువారం అర్ధరాత్రి చోరీకి పాల్పడిన వ్యక్తి ఇంటిదొంగా లేదా బయటి వ్యక్తులా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని వైరా డీఎస్పీ బి. సాయిశ్రీ, సీఐ జె. సదానిరంజన్ పరిశీలించారు. చోరీ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలను పరిశీలించడంతోపాటు ఖమ్మంనుంచి వచ్చిన క్లూస్‌టీం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కార్యాలయంలో పనిచేసే కొంతమంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.