India GDP Growth: జీడీపీలో జిల్లాల వాటా ఎంతంటే.. | The Share Of Districts In GDP | Sakshi
Sakshi News home page

India GDP Growth: జీడీపీలో జిల్లాల వాటా ఎంతంటే..

Nov 2 2023 2:57 PM | Updated on Nov 2 2023 2:57 PM

The Share Of Districts In GDP - Sakshi

దేశ స్థూలజాతీయోత్పత్తి వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 7.8 శాతంగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతున్న  దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయం, ఆర్థిక రంగాల పని తీరుతో ఇది సాధ్యమైందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అయితే దేశంలోని జిల్లాల అభివృద్ధిపై జీడీపీ ఆధారపడుతుంది. ప్రముఖ నగరాలున్న జిల్లాలు దేశాభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తున్నాయి. 2020-21 సంవత్సరానికిగాను జీడీపీ వృద్ధిరేటులో భాగంగా దేశంలోని జిల్లాల్లో అత్యధికంగా ముంబయి తన సహకారాన్ని అందించించినట్లు సమాచారం. 2020-21 ఏడాదికిగాను గణాంకాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం వివిధ జిల్లాల వాటా వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  • ముంబయి-రూ.22లక్షల కోట్లు
  • దిల్లీ-రూ.21లక్షల కోట్లు
  • కోల్‌కతా-రూ.12లక్షల కోట్లు
  • బెంగళూరు అర్బన్‌-రూ.9.9లక్షల కోట్లు
  • పుణె-రూ.9.7లక్షల కోట్లు
  • హైదరాబాద్‌-రూ.9.5లక్షల కోట్లు
  • అహ్మదాబాద్‌-రూ.9.4లక్షల కోట్లు
  • చెన్నై-రూ.9లక్షల కోట్లు
  • సూరత్‌-రూ.6.6లక్షల కోట్లు
  • థానే-రూ.6.6లక్షల కోట్లు
  • జూపుర్‌-రూ.5.4లక్షల కోట్లు
  • నాగ్‌పుర్‌-రూ.5.1లక్షల కోట్లు
  • నాసిక్‌-రూ.4.6లక్షల కోట్లు

Advertisement
 
Advertisement
Advertisement