
సాక్షి, హైదరాబాద్: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాల్లో ముగిసాయి. తద్వారా ఎనిమిది రోజుల వరుస లాభాలకు చెక్ చెప్పింది. సెన్సెక్స్ 505 పాయింట్లు కుప్పకూలి 65,280 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు నష్టంతో 19,332 వద్ద ముగిసాయి. దీంతో నిఫ్టీ కీలకమైన 19350 మార్క్ దిగువకు చేరింది.
టాటా మోటార్స్, టైటన్, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్టెల్ టాప్ గెయినర్స్‌గా, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బ్రిటానియా టాప్ లూజర్స్‌గానూ నిలిచాయి.
(Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు )
మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి