71,000 శిఖరంపై సెన్సెక్స్‌

Sensex crosses 71000 level to hit fresh all-time high - Sakshi

21,450 స్థాయి పైకి నిఫ్టీ

రెండో రోజూ బుల్‌ రికార్డుల్‌

ముంబై: ఐటీ, మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారి 71,000 పాయింట్ల ఎగువన ముగిసింది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీలు తాజా గరిష్టాలు నమోదు చేశాయి. వచ్చే ఏడాదిలో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాల ప్రభావం భారత్‌తో సహా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లపై కొనసాగింది. దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, ఎఫ్‌ఐఐల వరుస కొనుగోళ్లు అంశాలు కలిసొచ్చాయి.

ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. సెన్సెక్స్‌ 70,804 పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 1,092 పాయింట్లు ఎగసి 71,484 వద్ద కొత్త జీవితకాల గరిష్టం తాకింది. చివరికి 970 పాయింట్లు లాభపడి 71,484 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 310 పాయింట్లు బలపడి 21,492 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆఖరికి 274 పాయింట్లు లాభపడి 21,457 వద్ద నిలిచింది. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియలీ్ట, సేవా రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.  

► సూచీల రికార్డుల ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీ మొత్తం మార్కెట్‌ విలువ గత ట్రేడింగ్‌ సెషన్లలో రూ.8.11 లక్షల కోట్ల పెరిగి రూ.357.87 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ సూచీలో 30 షేర్లకు గానూ ఐదు మాత్రమే నష్టపోయాయి. ఇక వారం మొత్తంగా సెన్సెక్స్‌ 1,658 పాయింట్లు, నిఫ్టీ 487 పాయింట్లు చొప్పున లాభాలు నమోదు చేశాయి. ఇరు సూచీలకిది వరుసగా ఏడో వారం లాభాల ముగింపు.  
► పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు చివరిరోజు నాటికి 93.40 రెట్ల అధిక స్పందన లభించింది.  కంపెనీ మొత్తం 88.37 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 82.54 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం 115.97 రెట్లు, రిటైల్‌ కోటా 69.10 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటా 66.47 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి.
► డాలర్‌ మారకంలో రూపాయి విలువ 27 పైసలు బలపడి 83.03 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెల్లువెత్తడం, స్టాక్‌ సూచీల కొత్త శిఖరాలకు ► ఫెడ్‌ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపు, ద్రవ్యోల్బణం దిగివచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో  ఐటీ  షేర్లు రెండో రోజూ లాభపడ్డాయి. ఇనీ్ఫబీమ్‌ 12%, జెన్సార్‌ టెక్‌ 11%, మెస్టేక్‌ 6.50%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 6%, పర్‌సిస్టెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌ షేర్లు 5%, కో ఫోర్జ్, సైయంట్‌ 4%, టెక్‌ మహీంద్రా 3 చొప్పున లాభపడ్డాయి.  
► బ్యాంకింగ్‌ షేర్లలో ర్యాలీ భాగంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేరు ఒకటిన్నర శాతం లాభపడి రూ.91.24 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.ఒక లక్షల కోట్లను అధిగిమించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top