క్యాపిటల్‌ మార్కెట్లపై గురి | SEBI Chief Tuhin Kanta Pandey Growing Role Of Capital Markets Family Investments, Reflecting Structural Change | Sakshi
Sakshi News home page

క్యాపిటల్‌ మార్కెట్లపై గురి

Jun 9 2026 11:19 AM | Updated on Jun 9 2026 11:50 AM

SEBI Chief Tuhin Kanta Pandey Growing Role of Capital Markets Family Investments

దేశీయంగా కుటుంబ పెట్టుబడులలో క్యాపిటల్‌ మార్కెట్లకు ప్రాధాన్యం పెరుగుతున్నట్లు సెబీ ఛైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు. పొదుపు సొమ్ము మదుపు చేసేందుకు కీలక మార్గంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. సంపద సృష్టిలో భాగమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇది వ్యవస్థాగత మార్పును ప్రతిబింబిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. తద్వారా భారతీయులు దేశ వృద్ధిలో ఇన్వెస్ట్‌ చేయడంతోపాటు, భాగస్వాములవుతున్నట్లు వివరించారు.

వెరసి కుటుంబాల పొదుపు సొమ్మును ఇన్వెస్ట్‌ చేసేందుకు క్యాపిటల్‌ మార్కెట్లు కీలక అవకాశంగా మారుతున్నట్లు 2026 ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఇండియా ఇన్వెస్టర్‌ సదస్సు సందర్భంగా తెలియజేశారు. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసు(పీఎంఎస్‌) నిబంధనలపై విస్తారిత చర్చలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. త్వరలో చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

Advertisement
 
Advertisement
Advertisement